📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Bangladesh: మర్డర్ కేసులో నటి నుస్రత్ ఫరియా అరెస్ట్

Author Icon By Shobha Rani
Updated: May 19, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌(Bangladesh)కు చెందిన ప్రముఖ నటి నుస్రత్ ఫరియా(Nusrat Faria)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ మర్డర్‌ కేసుకు సంబంధించి ఆ దేశ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తాజాగా నటి ఫరియా థాయ్‌లాండ్‌కు వెళుతుండగా ఢాకా షహజలాల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ (Bangladesh) మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది జులైలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఓ విద్యార్ధి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నటి ఫరియాతోపాటు 17 మందిపై హత్యాయత్నం అభియోగాలు వచ్చాయి. ఈ కేసు కారణంగా ఆ దేశ అద్యక్షురాలు షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతోపాటు ఆమె పార్టీకి చెందిన పలువురు నేతలపై రకరకాల కేసులు నమోదైనాయి. ఇక హసీనా దేశ వదిలి పారిపోయి భారత్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే.ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం మేరకు ఫరియాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి సుజన్ హక్ వెల్లడించారు.

Bangladesh: మర్డర్ కేసులో నటి నుస్రత్ ఫరియా అరెస్ట్

హత్యాయత్నం కేసులో ఆరోపణలు
ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తమ బృందం ఎయిర్‌ పోర్టులో నటి ఫరియాని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారి సుజన్ హక్ తెలిపారు. కోర్టు కూడా ఆమెపై హత్యాయత్నం కేసు అభియోగాన్ని సమర్థించిన విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆమెపై పతరా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిపారు. అరెస్టు తర్వాత నటిని వతారా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆమెను అక్కడ కస్టడీలో ఉంచడానికి బదులుగా, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ (DMP) డిటెక్టివ్ బ్రాంచ్ (DB) కార్యాలయానికి తరలించినట్లు ప్రోథోమ్ అలో వర్గాలు తెలిపాయి.ఈ కేసు నుస్రత్ ఫరియా (Nusrat Faria) జీవితానికే కాక, బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. హత్యాయత్నం కేసులో ఆమెపై ముద్రలు తీవ్రంగా ఉండటంతో, ఈ కేసు పరిణామాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
జీవిత చరిత్ర ఆధారిత చిత్రం – ముజిబ్
ఆషికి (2015) మువీతో కెరీర్‌ ప్రారంభించిన ఫరియా.. అందులో ఆమె అంకుష్ హజ్రా సరసన ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఆ తర్వాత హీరో 420 (2016), బాద్షా – ది డాన్ (2016), ప్రేమి ఓ ప్రేమి (2017), బాస్ 2: బ్యాక్ టు రూల్ (2017) వంటి పలు వరుస హిట్ మువీల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. 2023లో బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా నిర్మించిన ‘ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్’లో షేక్ హసీనా పాత్రను నటి ఫరియా పోషించింది. దిగ్గజ శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్, భారత్‌ కలిసి నిర్మించాయి. ఇందులో అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు.

Read Also: Indian Army: పాక్ క్షిపణులను ధ్వంసం చేసిన భారత ఆర్మీ..వీడియో విడుదల

Actress Nusrat Faria arrested in murder case Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.