📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Abhishek Sharma – టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

Author Icon By Anusha
Updated: September 11, 2025 • 7:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) క్రికెట్ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చిన యూఏఈతో భారత్‌ జట్టు తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఉత్సాహపరిచింది. బుధవారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోరులో, ఆతిథ్య యూఏఈ జట్టును భారత్ 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో టోర్నీలో భారత్ తన శుభారంభం నమోదు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma). భారత ఇన్నింగ్స్ ఆరంభంలో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ బాది, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డును తన పేరుతో ముద్రించాడు. ఇంతవరకు ఏ భారత బ్యాటర్‌కూ సాధ్యం కాని ఈ ఘనతను అభిషేక్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఈ ప్రత్యేక క్షణం అభిమానుల్లో సంబరాలు రేపింది.

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్యకుమార్

దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Captain Suryakumar Yadav) తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మాయాజాలంతో యూఏఈ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. కేవలం 2.1 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అతనికి శివమ్ దూబే (3 వికెట్లు) చక్కటి సహకారం అందించడంతో యూఏఈ జట్టు 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌటైంది.అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చాడు.

Abhishek Sharma

స్వల్ప లక్ష్యంతో

హైదర్ అలీ వేసిన ఇన్నింగ్స్ (innings) తొలి బంతికే భారీ సిక్స్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. కేవలం 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వైస్ కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ (Vice-captain Shubman Gill),(20 నాటౌట్‌) లాంఛనాన్ని పూర్తి చేయడంతో భారత్ కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “వికెట్ ఎలా స్పందిస్తుందో చూడటానికే బౌలింగ్ ఎంచుకున్నాను.

ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్

మా కుర్రాళ్లు సమష్టిగా రాణించారు. కుల్దీప్ (Kuldeep) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అభిషేక్ ఎందుకు ప్రపంచ నంబర్ వన్ బ్యాటరో మరోసారి నిరూపించాడు. లక్ష్యం 200 అయినా, 50 అయినా అతను ఒకేలా ఆడతాడు. అతని ఆటతీరు నమ్మశక్యం కాదు. పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం మేమంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం” అని తెలిపాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/cpl-2025-falcons-into-playoffs-seales-zangu-performance/sports/545194/

abhishek sharma batting highlight abhishek sharma rare record abhishek sharma six first ball Breaking News india vs uae t20 match Indian cricket history latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.