📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Abbas Araghchi: ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా సిద్ధం అన్న అబ్బాస్ అరాఘ్చీ

Author Icon By Vanipushpa
Updated: June 21, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్, ఇరాన్(Israel-Iran) మధ్య ఘర్షణ వాతావరణం రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ(Abbas Araghchi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌(America-Israel) పక్షాన చేరితే, అది కేవలం ఇరాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్, ఇరాన్‌పై ఇజ్రాయెల్ పరస్పర దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా కూడా సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకుంటారని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అబ్బాస్ అరాఘ్చీ స్పందించారు. అమెరికా సైనిక జోక్యం గురించి ఆ దేశ అధ్యక్షుడు ఆలోచించడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

Abbas Araghchi: ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా సిద్ధం అన్న అబ్బాస్ అరాఘ్చీ

యూరోపియన్ విదేశాంగ మంత్రులతో అరాఘ్చీ భేటీ
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని నివారించేందుకు దౌత్యపరమైన మార్గాలపై చర్చించేందుకు అరాఘ్చీ జెనీవాలో యూరోపియన్ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులకు అమెరికా రహస్యంగా మద్దతు ఇస్తూ, మరోవైపు అణు ఒప్పంద చర్చలకు తమను ఆహ్వానించడం సరికాదని ఆయన విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో అణు చర్చలు జరపడానికి ఇరాన్ సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా జోక్యం పై కఠిన స్పందన
ఇజ్రాయెల్‌కి మద్దతుగా అమెరికా బహిరంగంగా లేదా రహస్యంగా సైనికంగా జోక్యం చేసుకుంటే,
‘‘అది కేవలం ఇరాన్‌కే కాదు, బహుశా యావత్తు మానవాళికే ముప్పు’’ అని అరాఘ్చీ హెచ్చరించారు.ట్రంప్ సైనిక జోక్యాన్ని “ఆలోచిస్తున్నట్లు” చెప్పడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెనీవాలో అరాఘ్చీ, యూరోపియన్ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు.
చర్చలలో ప్రధానాంశాలు: ఇరాన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు మార్గాల అన్వేషణ, ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను తగ్గించే డిప్లొమసీ, అణు ఒప్పంద పునరుద్ధరణలో అమెరికా నిజమైన పాత్రపై అనుమానాలు. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే ప్రపంచానికే ముప్పు: ఇరాన్ అరాఘ్చీ హెచ్చరిక.

Read Also: Barak System: బ‌రాక్ మిస్సైల్ సిస్ట‌మ్ వాడుతున్న ఇజ్రాయిల్

Abbas Araghchi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.