📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India-China: మిత్రదేశాల మధ్య చిచ్చు పెట్టే వ్యూహం: రష్యా మంత్రి

Author Icon By Shobha Rani
Updated: May 16, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌, చైనా (India-China)ల మధ్య తగాదాలు పెట్టేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా (Russia) విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ (Sergei Lavrov) సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ‘సరిహద్దులు లేని సంస్కృతి, సాంస్కృతిక దౌత్యం పాత్ర, అభివృద్ధి అనే సమావేశంలో లావ్రోవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆసియా- పసిఫిక్‌ ప్రాంతంలోని ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తే.. చైనా వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ పశ్చిమ దేశాలు ఇండో- పసిఫిక్‌ ప్రాంతం అని పిలవడం మొదలుపెట్టాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ (Sergei Lavrov) తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్-చైనా (India-China) సంబంధాలపై ఆసక్తికరంగా మారాయి. “పశ్చిమ దేశాలు చైనా వ్యతిరేక ధోరణితో ఇండో-పసిఫిక్ అనే పదాన్ని ప్రవేశపెట్టాయి. దీనివల్ల భారత్-చైనా (India-China)మధ్య ఎప్పుడైనా గొడవలు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు,” అని పేర్కొన్నారు.

India-China: మిత్రదేశాల మధ్య చిచ్చు పెట్టే వ్యూహం: రష్యా మంత్రి

పాక్‌కు నిధులు..చైనాకు సాయం?

భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, యూఎస్‌లు కలిసి ఏర్పాటైన క్వాడ్‌ను గతంలో లావ్రోవ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. చైనాను కట్టడి చేసేందుకే దీన్ని ఏర్పాటు చేశారని విమర్శించేవారు. అయితే, ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌లు కలసి ఆకుస్‌ (AUKUS) సైనిక కూటమి ఏర్పాటు తర్వాత ఆయన క్వాడ్‌పై విమర్శలు చేయడం ఆపేశారు. ఈసందర్భంగా పశ్చిమదేశాలు ఆగ్నేయ ఆసియా దేశాలను అణగదొక్కాలని చూస్తున్నాయని ఆరోపించారు. పశ్చిమ దేశాలు భారత్, చైనా లాంటి శక్తివంతమైన దేశాల మధ్య భిన్నాభిప్రాయాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నాయని లావ్రోవ్ (Sergei Lavrov) అభిప్రాయపడ్డారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని శాంతి, సహకారాన్ని దెబ్బతీసేలా విదేశీ కుట్రలు సాగుతున్నాయని ఆయన హెచ్చరించారు. తాము ఇక్కడ దశాబ్దాలుగా భాగస్వాములుగా ఉంటూ ఆర్థికంగా, రాజకీయంగా, సైనికపరంగా బలపడుతున్నామని లావ్రోవ్ తెలిపారు. ఈక్రమంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే పశ్చిమదేశాలకు చెందినవారు ఇక్కడ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారన్నారు. ఈక్రమంలోనే వారు ఆగ్నేసియా ఆసియా దేశలను అణగదొక్కాలనుకుంటున్నారని ఆరోపించారు.

Read Also: Taliban: తాలిబాన్‌ మంత్రితో జైశంకర్ చర్చలు

A tactic to drive a Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news wedge between allies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.