📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Friedrich Merz : జర్మనీ రాజకీయాల్లో చారిత్రక పరిణామం

Author Icon By Sudheer
Updated: May 6, 2025 • 10:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జర్మనీలో రాజకీయంగా సంచలనంగా నిలిచిన ఓ పరిణామం చోటుచేసుకుంది. కన్జర్వేటివ్ పార్టీ నేత ఫ్రెడ్రిక్ మెర్జ్ జర్మనీ నూతన ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నిక అంత తేలికగా జరగలేదు. ప్రధాన అభ్యర్థిగా ఉన్న మెర్జ్, తొలి రౌండ్ ఓటింగ్‌లో మెజారిటీ సాధించడంలో విఫలమయ్యారు. యుద్ధానంతర జర్మనీ చరిత్రలో ఛాన్సలర్ అభ్యర్థి ఓటింగ్‌లో మొదటి ప్రయత్నంలోనే ఓడిపోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ అఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మొదటి రౌండ్‌లో తేడా తలెత్తింది

మొదట మెర్జ్ గెలుపు సునిశ్చితమని అంతా భావించినా, మొదటి రౌండ్‌లో తేడా తలెత్తింది. కానీ, రెండో విడత ఓటింగ్‌లో మాత్రం ఆయన 325 ఓట్లు సాధించి మెజారిటీ గెలుపుతో ఛాన్సలర్ పీఠాన్ని అధిరోహించారు. మొత్తం 630 ఓట్లలో 289 ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా పోలయ్యాయి. ఈ విజయం ద్వారా ఆయన అధికారికంగా పదో ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మొదటి ఓటింగ్‌లో ఎదురైన షాక్ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన తిరిగి విజయం సాధించడం రాజకీయంగా గొప్ప విజయంగా పరిగణించబడుతోంది.

ఫ్రెడ్రిక్ మెర్జ్ నాయకత్వంలో జర్మనీకి స్థిరత్వం, అభివృద్ధి సాధ్యమవుతుందా?

ఫ్రెడ్రిక్ మెర్జ్ నాయకత్వంలో జర్మనీకి స్థిరత్వం, అభివృద్ధి సాధ్యమవుతుందా? అనే అంశంపై అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. యూరోపియన్ యూనియన్, యూఎస్, నాటో దేశాలతో సంబంధాలు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ వంటి కీలక అంశాల్లో మెర్జ్ ఎలా వ్యవహరిస్తారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్. జర్మనీలో కొత్త అధ్యాయం ప్రారంభమైన ఈ సమయంలో, మెర్జ్ నిర్ణయాలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.

Read Also : Visakhapatnam : విశాఖలో కరాచీ బేకరి పేరుపై వివాదం

Conservative Merz Germany's Merz wins vote for chancellor Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.