📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Tamil nadu: పొల్లాచి వేధింపుల కేసులో 9 మంది దోషులు: కోర్టు

Author Icon By Shobha Rani
Updated: May 13, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు (Tamil Nadu)లోని పొల్లాచిలో 2019లో వెలుగు చూసిన లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని కోయబంత్తూర్‌లోని సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది.
నిందితులు తొమ్మిది మంది 2019 నుంచి జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. వారిని మంగళవారం కట్టుదిట్టమైన భద్రతతో సెషన్స్ కోర్టుకు తీసుకొచ్చారు. ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం వీరందరినీ దోషులుగా తేల్చింది. మధ్యాహ్నం వీరికి శిక్షను ఖరారు చేయనుంది. అయితే, దోషులకు జీవిత ఖైదు విధించాలని బాధితుల తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు.

Tamil nadu: పొల్లాచి వేధింపుల కేసులో 9 మంది దోషులు: కోర్టు

కళాశాల విద్యార్థినితో మొదలైన దుర్మార్గం
2016-2018 మధ్య కాలంలో ఒక కళాశాల విద్యార్థినితో సహా పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు ఇది. నిందితులు మహిళలను లైంగికంగా వేధించడమే కాకుండా వాటిని మొబైల్‌ ఫోన్‌లలో చిత్రీకరించారు. వాటిని ఉపయోగించి మహిళలను డబ్బు కోసం బ్లాక్‌ మెయిల్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత ఈ కేసును పొల్లాచి పోలీసులు విచారణ చేశారు. అనంతరం తమిళనాడు(Tamil Nadu) క్రైమ్‌ బ్రాంచ్‌- క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (CB-CID)కు బదిలీ చేశారు. ఆ తర్వాత సీబీఐకి బదిలీ చేశారు. ఈ కేసు అప్పట్లో తమిళనాడు(Tamil Nadu)లో పెద్దఎత్తున సంచలనం సృష్టించింది. రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో బాధితుల తరఫున 200కు పైగా పత్రాలను, 400 ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఆధారాలుగా చూపించారు.

Read Also: USA: అమెరికా వస్తువులపై భారత్‌ సుంకాల ప్రతీకారం

9 found guilty in Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Pollachi molestation case: Court Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.