📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Latest Telugu News: Visa: అమెరికాలో 85 వేల వీసాలు రద్దు..షాక్ లో విద్యార్థులు

Author Icon By Vanipushpa
Updated: December 9, 2025 • 1:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా పౌరుల భద్రత, ప్రజా భద్రతా ప్రమాణాలను అమలు చేసే దిశగా యూఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వివిధ కేటగిరీలకు చెందిన 85,000 వీసా(Visa)లను రద్దు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇది గత సంవత్సరం రద్దు చేసిన వాటి కంటే రెట్టింపు కావడం గమనార్హం. రద్దు చేసిన వీసాలలో 8,000 మందికి పైగా విద్యార్థుల వీసాలు ఉన్నాయని స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, దాడులు, దొంగతనం వంటి నేరాలే ఇందులో సగం వీసాల రద్దుకు కారణం అని తెలిపారు. “ఈ వ్యక్తులు మా సమాజ భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తారు. అందుకే వారిని దేశంలోకి అనుమతించదలుచుకోలేదు” అని ఆ అధికారి స్పష్టం చేశారు.

Read Also: Google Street Hyderabad : గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి..

America

దరఖాస్తుదారుడు అమెరికన్ భద్రతకు ముప్పు

అడ్మినిస్ట్రేషన్ వీసా పరిశీలన విధానం అత్యంత కఠినంగా ఉందని.. ముఖ్యంగా హై-రిస్క్ ప్రాంతాల నుంచి వచ్చే దరఖాస్తుదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2021లో సైనిక ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న భద్రతా పరిస్థితులపై ఎప్పుడూ ఆందోళనలు ఉన్నాయని, వీసా దరఖాస్తుదారులు అమెరికన్ భద్రతకు ముప్పు కలిగించకుండా నిరోధించడానికి తనిఖీలను కఠినతరం చేశామని అధికారులు తెలిపారు.

చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తుల వీసాలు రద్దు

అమెరికా విదేశాంగ విధానానికి విరుద్ధంగా.. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తులు, స్టూడెంట్ల వీసాలను రద్దు చేస్తున్నామని, ఈ సంఖ్య వందలు, వేలల్లో ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతంలో ప్రకటించారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే వేలాది వీసాలు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అలాగే వీసా అర్హతను నిర్ణయించేటప్పుడు.. కాన్సులర్ అధికారులు కేవలం ఒక అంశాన్ని మాత్రమే కాకుండా, దరఖాస్తుదారుడి మొత్తం పరిస్థితులను పరిశీలించి, ప్రతి కేసును విడిగా నిర్ణయిస్తారని అధికారులు వివరించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

America Immigration Policy Breaking News in Telugu Education Abroad Google News in Telugu Immigration News International Students Latest In telugu news Student Visas Telugu News Today US Visa Cancellation visa issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.