📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Frogs: బతికున్న కప్పలను మింగిన 82 ఏళ్ల బామ్మ.. ఎక్కడంటే?

Author Icon By Anusha
Updated: October 9, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలో ఇంకా కొంతమంది గ్రామీణ ప్రాంత ప్రజలు నాటి వైద్యంలో విశ్వాసం కొనసాగిస్తున్నారు. ఈ వైద్య పద్ధతిలో ఆధునిక మెడికల్ పద్ధతుల (Modern medical techniques) పట్ల ఎక్కువగా అవగాహన లేకపోవడం వల్ల, చిన్న రోగాలకు ఆకులు, మూలికలు, పసర్లు వంటి సహజ పదార్థాలతో నయం చేసుకోవడం సాంప్రదాయంగా ఉంటుంది.

Love: అమెరికా రాయబారికి చైనా యువతితో లవ్ ఎఫైర్..ఊడిన పదవి

ఈ పద్ధతిని ఎక్కువగా వృద్ధులు అనుసరిస్తారు, ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి ఇదే పద్ధతిని చూసి పెరిగారు. వారు దీన్ని సంప్రదాయంగా “నాటు వైద్యము”గా గుర్తిస్తారు.అయితే, నాటు వైద్యానికి కొన్ని పరిమితులు, ప్రమాదాలు ఉంటాయి. చిన్న అనారోగ్యాలకే కాకుండా, తీవ్రమైన రోగాలు ఉన్నపుడు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తే, పరిస్థితి మరింత కష్టతరం అవుతుంది.

బతికి ఉన్న 8 కప్పలను స్వాహా చేసింది

తాజాగా ఇలాంటి ఘటనే చైనా (China) లో జరిగింది. తన అనారోగ్యం నయం చేసుకోవాలని తనకు తానే నాటు వైద్యం చేసుకుంది ఓ వృద్ధురాలు. అందులో భాగంగా బతికి ఉన్న 8 కప్పల (Frogs) ను స్వాహా చేసింది. అనారోగ్యం తగ్గడం అటుంచితే.. ఆరోగ్యం మరింత క్షీణించింది.తూర్పు చైనాకు చెందిన 82 ఏళ్ల ముసలావిడ జాంగ్.. నడుము నొప్పితో బాధ పడుతోంది.

అయితే వైద్యుల వద్దకు వెళ్లకుండా తనకు తానే నాటు వైద్యంతో నయం చేసుకోవాలనుకుంది. బతికి ఉన్న కప్పల (Frogs) ను తినడం వల్ల తన నొప్పి తగ్గుతుందని భావించింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా.. తన కోసం కొన్ని కప్పలను పట్టుకోవాలని కుటుంబ సభ్యులను కోరింది.

మూడు కప్పలను ఒకరోజు.. తర్వాత రోజు 5 కప్పలను

దీంతో వారు తీసుకువచ్చిన వాటిలో మూడు కప్పల (Frogs) ను ఒకరోజు.. తర్వాత రోజు 5 కప్పలను బతికుండగానే మింగేసింది జాంగ్. అన్నీ పెద్దవారి అరచేతి పరిమాణం కంటే చిన్నవిగా ఉన్నాయి.కప్పలను మింగిన తర్వాత జాంగ్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ సెప్టెంబర్ ప్రారంభంలో జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలోని ఒక ఆసుపత్రిలో చేరింది.

కప్పలను తిన్న తర్వాత తన తల్లి నడవలేకపోయిందని ఆమె కుమారుడు తెలిపాడు. కప్పలను తిన్న తర్వాత జాంగ్‌ (Zhang) కు మొదట్లో అసౌకర్యంగా అనిపించింది. కానీ క్రమంగా కొన్ని రోజుల్లో నొప్పి తీవ్రమైంది. ఏమైందని ఆరా తీస్తే.. అప్పుడు తన కుటుంబానికి తాను ఏమి చేసిందో చెప్పింది వృద్ధురాలు.అనంతరం ఆమెను జెజియాంగ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రికి తరలించారు.

Frogs

జాంగ్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో కణితి లాంటిది లేదన్నారు

అక్కడ జాంగ్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో కణితి లాంటిది లేదన్నారు. అయితే, అధిక సంఖ్యలో ఆక్సిఫిల్ కణాలు ఉన్నట్లు తెలిపారు. ఇది పారాసైట్ ఇన్ఫెక్షన్లు (Parasite infections) లేదా రక్త రుగ్మతలను సూచిస్తుందని తెలిపారు.తదుపరి పరీక్షల తర్వాత జాంగ్‌కు నిజంగా పారాసైట్ ఇన్ఫెక్షన్లు సోకినట్లు నిర్ధరణ అయింది.

కాగా, కప్పలను మింగడం వల్ల ముసలావిడ జీర్ణవ్యవస్థ దెబ్బతిందని.. స్పార్గనమ్‌తో (sparganum) సహా పలు రకాల పరాన్నజీవులు (Parasites) ఆమె శరీరంలో ఉన్నాయి అని ఆసుపత్రి వైద్యుడు ఒకరు చెప్పారు. రెండు వారాల చికిత్స తర్వాత జాంగ్‌ను డిశ్చార్జ్ చేశారు.ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని డాక్టర్ వు జోంగ్‌వెన్ అన్నారు.

చైనాలో చాలా మంది వృద్ధులు తన ఆరోగ్యం గురించి

ఇటీవల కొన్నేళ్లలో ఇలాంటి కేసులు కొన్ని వచ్చాయన్నారు. ఇలా చేస్తున్నవారిలో వృద్ధులే అధికంగా ఉన్నారని తెలిపారు. చైనాలో చాలా మంది వృద్ధులు తన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులతో చెప్పకుండా ఇలాంటివి చేస్తారన్నారు.ఆరోగ్య పరిస్థితి తీవ్రం అయ్యాక ఆస్పత్రులకు వస్తారన్నారు.

అయితే ఇలా బతుకున్న జంతువులను తింటే.. పరాన్నజీవులను శరీరంలోకి ప్రవేశిస్తాయని వైద్యుడు చెప్పారు. ఫలితంగా దృష్టి లోపం, ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లతో సోకుతాయని.. కొన్ని సార్లు ప్రాణాంతకం కూడా అవుతాయని వెల్లడించారు డాక్టర్ వు జోంగ్‌వెన్.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

China news elderly woman Herbal Remedies latest news rural healthcare Telugu News Traditional Medicine

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.