ఇజ్రాయెల్‌తో ఇరాన్ మధ్య పన్నెండు రోజులపాటు జరిగిన యుద్ధం(Iran-Israel War)లో ప్రాణనష్టం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్ ఆరోగ్య శాఖ తాజా ప్రకటన మేరకు, ఇప్పటివరకు 627 మంది ఇరానియన్లు ఈ దాడుల్లో మృతి (627 Iranians died)చెందారు. మరో 4,870 మందికి పైగా గాయాలయ్యాయని వెల్లడించింది. ఈ దాడుల్లో అత్యధిక ప్రాణనష్టం దేశ రాజధాని టెహ్రాన్, అలాగే కెర్మాన్షా ప్రాంతాల్లో నమోదైందని స్పష్టం చేసింది.
మరణాల సంఖ్యపై విభిన్న వాదనలు
ఇరాన్ ప్రభుత్వం తెలిపిన అంకెలతో విభిన్నంగా, మానవ హక్కుల సంఘాలు మరింత భయంకరమైన వాస్తవాలను బయటపెడుతున్నాయి. వీరి సమాచారం ప్రకారం, ఇప్పటివరకు యుద్ధంలో చనిపోయినవారి సంఖ్య 974కి చేరిందని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా శవాలను వెలికితీయలేదని, విస్తృత శిథిలాల మధ్య శోధన కొనసాగుతోందని సూచిస్తున్నారు. దీనితో, మరణాల సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రజల భద్రతకు తీవ్ర ఆందోళన
ఈ యుద్ధంలో నిరాయుధ పౌరులపై తీవ్ర ప్రభావం పడినట్టు కనిపిస్తోంది. ఎక్కువ మంది మృతులు సాధారణ ప్రజలే కావడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఆసుపత్రులు, సహాయక కేంద్రాలు గాయపడిన వారి సంరక్షణలో నిమగ్నమై ఉన్నాయని, దేశ ఆరోగ్య వ్యవస్థపై భారీస్థాయిలో ఒత్తిడి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. యుద్ధం తక్షణం ఆగకపోతే మరిన్ని ప్రాణ నష్టం జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా అంతర్జాతీయ సమాజం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించే మార్గాలపై చర్చిస్తోంది.
Read Also : Ali Khamenei : వేరే దేశానికి మకాం మార్చనున్న ఖమేనీ?