📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran : ఇజ్రాయిల్ దాడుల్లో 500 మంది మృతి

Author Icon By Divya Vani M
Updated: June 23, 2025 • 7:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్ (Israel) చేసిన బాంబు దాడుల్లో ఇప్పటివరకు 500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ సంఖ్యను సోమవారం ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. జూన్ 13 తర్వాత ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ దాడుల్లో కనీసం మూడు వేల మందికి పైగా గాయపడ్డారు. ఆ వివరాలను ఇరాన్ (Iran) స్టేట్ మీడియా వెల్లడించింది. అయితే అంతర్జాతీయ మీడియాపై ఆంక్షల కారణంగా హతమైయ్యిన వారి అసలు సంఖ్య స్పష్టంగా తెలియడం లేదు.ఇరాన్‌లో పని చేస్తున్న మానవ హక్కుల సంస్థల ప్రకారం, ఇరాన్ వెల్లడించిన మృతుల సంఖ్య కంటే రెట్టింపు మరణాలు సంభవించి ఉండే అవకాశముంది. దాడుల తీవ్రతను బట్టి ఇది అంచనా వేయవచ్చు.

ఫోర్డో అణు కేంద్రంపై దాడి – ఐడీఎఫ్ వెల్లడి

ఫోర్డో భూగర్భ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దళాలు భారీ దాడి చేశాయి. ఫోర్డోకు వెళ్లే ప్రధాన మార్గాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ప్రకటించాయి. ఈ దాడుల్లో అమెరికా బీ2 బాంబర్ల సహకారం కూడా ఉందని సమాచారం.ఆదివారం తెల్లవారుజామున అమెరికా పంపిన బీ2 బాంబర్లు, బంకర్ బస్టర్ బాంబులతో న్యూక్లియర్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఫోర్డో కేంద్రం ప్రణాళికగా ధ్వంసమైందని అంటున్నారు.

గగనతలంలో విమానాల ఆంక్షలు – ప్రయాణాలకు ప్రభావం

ఇరాన్ గగనతలంలోకి ప్రస్తుతం ఎలాంటి కమర్షియల్ విమానాలు ప్రవేశించడం లేదు. అంతేకాకుండా, ఇరాక్‌, సిరియా, జోర్డాన్‌, లెబనాన్ గగనతలాన్ని కూడా విమానాలు తప్పించుకుంటున్నాయి.దుబాయ్ ఎయిర్‌పోర్టులో 120కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. జోర్డాన్‌లోని క్వీన్ అలియా విమానాశ్రయంలో 40 శాతం విమానాలు రద్దయ్యాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జూలై 3 వరకు దుబాయ్‌కి వెళ్లే విమానాలను నిలిపివేసింది. బ్రిటీష్ ఎయిర్‌వేస్ దుబాయ్, దోహా విమానాలను రద్దు చేసింది.

Read Also : Executions : ఇరాన్‌లో వరుస ఉరిశిక్షలు..!

airspace ban attack on Fordow nuclear facility human rights organizations Iran death toll Israel Iran attacks

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.