📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Paradip port: పరదీప్‌ పోర్టులో కలకలం: పాకిస్థాన్‌ సిబ్బందితో నౌక..

Author Icon By Shobha Rani
Updated: May 14, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌-పాకిస్థాన్‌ (India-pak) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఓడరేవుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఒడిశాలోని పరదీప్‌ పోర్టు(Paradip port)కు వచ్చిన ఓ షిప్‌ కలకలం రేపింది. అందులో 21 మంది పాకిస్థాన్‌ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించడమే అందుకు కారణం. దీంతో ఆ పోర్టులో భద్రతను పెంచారు. ఆ ప్రాంతంలో హైఅలర్ట్‌ ప్రకటించారు.

Paradip port: ఓడరేవులో 21 మంది పాకిస్థాన్‌ సిబ్బంది

నిఘా, తనిఖీలపై అధికారులు దృష్టి
బుధవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి సింగపూర్‌ మీదుగా ఓ నౌక పరదీప్‌ పోర్టు (Paradip port) కు చేరింది. ‘ఎమ్‌టీ సైరెన్‌ II’ పేరుతో ఉన్న ఈ షిప్‌లో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. ఇది ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థ కోసం ముడి చమురును తీసుకొచ్చింది. తనిఖీలు చేపట్టగా సిబ్బందిలో 21 మందిని పాకిస్థానీయులుగా గుర్తించారు.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తత
ఇమిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి దీనిగురించి సమాచారం అందడంతో వెంటనే ఒడిశా మెరైన్‌ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోర్టులో భద్రతను మరింత పెంచినట్లు మెరైన్‌ పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బబితా దుహేరి తెలిపారు. భారత్‌-పాక్‌ (India-pak) మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓడరేవు ప్రాంతంలో హైఅలర్ట్‌ ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ నౌక పోర్టుకు 20 కి.మీ. దూరంలోని ‘పీఎం బెర్త్‌’ వద్ద లంగర్‌ వేసి ఉంది. ఇందులో 11,350 మెట్రిక్‌ టన్నుల ముడి చమురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముడి చమురు అన్‌లోడింగ్‌ పూర్తయ్యే వరకూ 25 మంది సిబ్బంది నౌకను వీడకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Read Also: Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతి మహిళ

21 Pakistani Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News personnel at the port Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.