📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Karachi Jail: కరాచీ జైలు నుంచి తప్పించుకున్న 200 మంది ఖైదీలు

Author Icon By Shobha Rani
Updated: June 3, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌లోని కరాచీ (Karachi Jail) నగరంలో తీవ్ర కలకలం రేగింది. కరడుగట్టిన నేరస్తులకు నిలయమైన మాలిర్ జైలు నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలు తప్పించుకున్నారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత జైలు లోపల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఖైదీలు భద్రతా సిబ్బందితో తీవ్రంగా ఘర్షణపడి, జైలు ప్రధాన ద్వారాలను బద్దలుకొట్టి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో కరాచీ వ్యాప్తంగా భయాందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దాదాపు 200 మంది ఖైదీలు జైలు (Karachi Jail) నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఖైదీలు భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు. వీరిలో కొంతమంది పోలీసులను గాయపరిచి, జైలు ప్రధాన గేట్లు బద్దలుకొట్టి పారిపోయారు. ఈ ఘర్షణలో ఒక పోలీసు అధికారి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అంతేగాక, జైలు ప్రాంగణంలో కాల్పులు జరిగాయని కూడా స్థానిక మీడియా నివేదిస్తోంది. జైలులో (Karachi Jail) ఖైదీలు ఒక్కసారిగా పోలీసు అధికారులపై దాడికి దిగి, వారిని గాయపరిచి ఈ దారుణానికి ఒడిగట్టారని సమాచారం. ఈ క్రమంలో జైలు ప్రాంగణంలో పెద్ద ఎత్తున కాల్పులు కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక పోలీసు అధికారి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు, తప్పించుకున్న ఖైదీల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు సుమారు 20 మంది ఖైదీలను తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన వారి కోసం వేట కొనసాగుతోంది.

Karachi Jail: కరాచీ జైలు నుంచి తప్పించుకున్న 200 మంది ఖైదీలు

జైలు డీఐజీ హసన్ సెహ్టో ప్రకటన
జైలు డీఐజీ హసన్ సెహ్టో మీడియాతో మాట్లాడుతూ, జైలు (Karachi Jail) మొత్తాన్ని సీల్ చేశాం. ఈ ఘటనలో కొంతమంది ఖైదీలు, పోలీసులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. పాకిస్థాన్ రేంజర్లు, పోలీసులు, ఎఫ్‌సీ (ఫ్రాంటియర్ కార్ప్స్) సిబ్బంది పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా, జైలుకు సమీపంలో ఉన్న జాతీయ రహదారిని రెండు వైపులా తాత్కాలికంగా మూసివేశారు. సాధారణ ప్రజలు జైలు పరిసర ప్రాంతాలకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, జైలు(Karachi Jail) గోడ ఒకటి స్వల్ప భూకంపం కారణంగా కూలిపోయిందని, దాంతో ఖైదీలు పారిపోయారని కూడా కొన్ని నివేదికలు వెలువడుతున్నాయి. అయితే, ఖైదీలు హింసాత్మకంగా గేట్లు బద్దలు కొట్టి పారిపోయారనేదే ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు సమాచారం. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. జైలు లోపల భద్రతా లోపాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

Read Also: Gaurav Kundi: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై పోలీసుల దాడి

200 prisoners escaped Breaking News in Telugu from Karachi jail Google news Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.