ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, హష్ మనీ కేసులో ట్రంప్ ను న్యూయార్క్ కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చింది. ఈ కేసులో ట్రంప్ కు ఈ నెల 10 న ట్రంప్ కు శిక్ష ఖరారు చేస్తామని న్యూయార్క్ జడ్జి జస్టిస్ హవాన్ మర్చన్ పేర్కొన్నారు. దోషిగా తేలిన ట్రంప్ కు శిక్ష విధించడం తప్పదని చెబుతూనే ఆయన జైలుకు వెళ్లే అవసరం మాత్రం లేదని జస్టిస్ హవాన్ పేర్కొన్నారు. ఇది 10 న ట్రంప్ కు శిక్ష ఖరారవుతుంది.
ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం కూడా లేదని, ట్రంప్ కు అన్ కండిషనల్ డిశ్చార్జ్ అమలు చేస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీన హష్ మనీ కేసులో తుది తీర్పు వెలువరిస్తామని, ఆ రోజు వ్యక్తిగతంగానైనా లేక వర్చువల్ గా నైనా ట్రంప్ కోర్టుకు హాజరుకావొచ్చని తెలిపారు. 10 న ట్రంప్ కు శిక్ష ఖరారైతే, దోషిగా తేలి శిక్ష ఖరారైన తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు.
ఆరోపణలను కొట్టివేయాలంటూ కోర్టుకు విజ్ఞప్తి
హష్ మనీ కేసులో నుంచి ట్రంప్ ను తప్పించేందుకు ఆయన లాయర్లు విశ్వప్రయత్నం చేశారు. 10 న ట్రంప్ కు శిక్ష ఖరారు చేయవద్దని ప్రయత్నిస్తున్న ట్రంప్ లాయర్లు ట్రంప్ పై ఆరోపణలను కొట్టివేయాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రెసిడెంట్ హోదాలో ట్రంప్ కు ఈ కేసు నుంచి రక్షణ లభిస్తుందని వాదించారు.
అయితే, ట్రంప్ లాయర్ల వాదనలను న్యూయార్క్ జ్యూరీ తోసిపుచ్చింది. ప్రెసిడెంట్ హోదాలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మాత్రమే రక్షణ ఉంటుందని, వ్యక్తిగతమైన కేసులకు అలాంటి మినహాయింపులు ఏవీ లేవని జ్యూరీ స్పష్టం చేసింది. హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా నిర్ధారణ కావడంతో 10 న ట్రంప్ కు శిక్ష ఖరారైన దానిని తప్పించడం కష్టమని పేర్కొంది. ఈమేరకు జస్టిస్ హవాన్ మర్చన్ 18 పేజీల తుది తీర్పును ఈ నెల 10న వెలువరిస్తామని చెప్పారు.
Also Read: గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది – కేటీఆర్