📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

మస్క్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: December 23, 2024 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక ట్రంప్‌ విజయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో తన గెలుపునకు దోహదపడ్డ మస్క్‌కు ట్రంప్‌ తన క్యాబినెట్‌లో సముచిత స్థానం కల్పించారు.

‘ఎఫిషియెన్సీ’ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇక ట్రంప్‌ 2.0లో మస్క్‌ పాత్ర కీలకం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో మస్క్‌ అమెరికా అధ్యక్షుడు అవుతాడా..? అంటూ చర్చ మొదలైంది. ముఖ్యంగా డెమోక్రటిక్‌ పార్టీ నేతలు ‘ప్రెసిడెంట్‌ మస్క్‌’ అంటూ ప్రచారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అమెరికాకు మస్క్‌ అధ్యక్షుడు అవుతాడంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మస్క్‌ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడని వ్యాఖ్యానించారు.
ఎలాన్‌ మస్క్‌ అధ్యక్షుడు కాలేడు
అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్‌ తొలిసారి అరిజోనాలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్క్‌ అంశంపై మాట్లాడారు. ‘ఎలాన్‌ మస్క్‌ ఎప్పటికీ అధ్యక్షుడు కాలేడు. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే.. ఆయన అమెరికాలో పుట్టలేదు’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్ష పదవిని చేపట్టబోయే వ్యక్తి అగ్రరాజ్యంలో జన్మించిన పౌరుడై ఉండాలి. కానీ, మస్క్‌.. దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆ తర్వాత అమెరికాకు వసల వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.

elon president trump USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.