📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారతీయులకు సౌదీ అరేబియా షాక్

Author Icon By Vanipushpa
Updated: January 15, 2025 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమ దేశానికి వచ్చే వారిని నియంత్రించడంలో భాగంగా సౌదీ అరేబియా వీసా రూల్స్‌ను కఠినతరం చేసింది. దీంతో భారత్ నుంచి అధికంగా సౌదీ అరేబియాకు వెళ్లే వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. వీసా నిబంధనల్లో మార్పుల తీసుకువస్తూ.. సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాకు వెళ్లి ఉపాధి పొందాలనుకునేవారికి ఆ దేశం కొత్త రూల్స్ పెడుతోంది. ఇళ్లల్లో పనులు చేయడం, భవన నిర్మాణ పనులు, దగ్గరి నుంచి ఒంటెలను చూసుకోవడం సహా అనేక పనులు చేయడానికి భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తూంటారు. ఇవే కాకుండా చాలా ఉద్యోగాలు, పనులు చేసుకునేందుకు సౌదీ అరేబియా దేశానికి వెళ్తున్నారు.

అక్కడి దేశాలకు కార్మికులు చాలా అవసరం. అందుకే భారత్ నుంచి ఎంతో మంది కార్మికులు.. ఆ దేశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే.. ఇప్పుడు అలా ఉపాధి కోసం వస్తున్న వారికి కొన్ని షరతులు పెట్టాలని సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక నుంచి సౌదీ అరేబియా వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా విద్య, వృత్తి అర్హతలను సంబంధించి ముందస్తుగా వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది. ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి సౌదీ అరేబియాకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో.. ఈ అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సౌదీ అరేబియా ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ కొత్త వీసా నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. సౌదీ అరేబియాలోని భారత దౌత్య కార్యాలయం ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.

ఈ కొత్త విధానం ప్రకారం.. వర్క్ వీసాలతో దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్లను తామే జారీ చేసినట్లు సదరు సంస్థలు ధృవీకరించాల్సి ఉంటుంది. ఇక సౌదీ అరేబియాలో అత్యధికంగా ఉపాధి పొందుతున్న విదేశీయుల్లో భారతీయలు రెండో స్థానంలో ఉన్నారు.

Indians Saudi Arabia visa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.