📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

భారతీయులకు జో బైడెన్ శుభవార్త

Author Icon By Vanipushpa
Updated: December 18, 2024 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ట్రంప్ ఎన్నికలో గెలిచి, జనవరిలో కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న తరుణంలో వీసాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆందోనళ చెందే వారికీ జో బైడెన్ శుభవార్త చెప్పింది. అమెరికా వెళ్లాలని, అక్కడ ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జో బైడెన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ నిపుణులను మరింత సులభంగా నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది. అలాగే, ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా లక్షలాదిమంది భారతీయ ప్రొఫెషనల్స్‌కు ప్రయోజనం చేకూరనుంది.
భారత్, చైనా దేశాలు భారీగా లబ్ధి
అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసా (నాన్ ఇమిగ్రెంట్) సాయంతో విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. ఈ వీసా ద్వారా భారత్, చైనా దేశాలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నిబంధనల్లో మార్పులు చేసి అవసరాలకు తగ్గట్టుగా విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పించింది.
ఈ కొత్త విధానంలో లేబర్ కండిషన్ అప్లకేషన్ కచ్చితంగా హెచ్-1బీ వీసా పిటిషన్‌కు అనుగుణంగా ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. తాజా మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకునే అవకాశం యజమానులకు లభిస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెంజాడ్రో ఎన్ మేయోర్కాస్ తెలిపారు.

America H1B visa Indians Joe Biden

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.