📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

పాలస్తీనియన్లను విడుదల చేయనున్న ఇజ్రాయెల్‌

Author Icon By Vanipushpa
Updated: January 18, 2025 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు సయోధ్య కుదరడంతో బందీల విడుదలకు మార్గం సుగమమైంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడుతలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 737 మంది పాలస్తీనియా పౌరులను విడిచిపెట్టనున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. వారంతా దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న బందీలు, ఖైదీలను విడుదల చేయనున్నట్లు ఆ దేశ న్యాయ శాఖ ప్రకటించింది. వారిని ఆదివారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని, అందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది. కాగా, గతంలో 95 మందిని విడుదల చేస్తున్నట్లు ఓ జాబితాను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. అందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు.

అయితే హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ క్యాబినెట్‌ శనివారం ఉదయం ఆమోదం తెలిపింది. దీంతో 737 మంది బందీలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ క్యాబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను హమాస్‌ ఇజ్రాయెల్‌కు అప్పగిస్తుంది. అదేవిధంగా, తమ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను ఇజ్రాయెల్‌ విడుదల చేయనుంది. బందీల్లో తొలి బృందాన్ని ఆదివారం విడుదల చేయడంతో ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది.

israel Palestinian Prisoners release

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.