📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడి అరెస్టుకు యత్నం

Author Icon By Vanipushpa
Updated: January 3, 2025 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్‌ను పోలీసులు అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడి అరెస్టుకు యత్నం చేసిన పోలీసులను భ‌ద్ర‌తా సిబ్బంది అడ్డుకున్నారు. దీనితో ఆరు గంట‌ల ప్ర‌తిష్టంభ‌న త‌ర్వాత పోలీసులు ఆ ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకున్నారు. ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టుకు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం అయ్యాయి. దీంతో అరెస్టును వాయిదా వేస్తున్న‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. సుమారు ఆరు గంట‌ల పాటు.. అధ్య‌క్షుడి భ‌ద్ర‌తా సిబ్బందితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. చివ‌ర‌కు పోలీసులు వెన‌క్కి వెళ్లిపోయారు.


కొనసాగుతున్న ద‌ర్యాప్తు
అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో యూన్‌పై నిఘా సంస్థ‌లు ద‌ర్యాప్తు చేప‌డుతున్నాయి. దేశంలో మార్షియ‌ల్ లాను అమలు చేయాల‌ని గ‌త డిసెంబ‌ర్‌లో యూన్ ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో అధ్య‌క్షుడు యూన్‌పై విప‌క్షాలు అభిశంస‌న ప్ర‌క‌టించాయి. దీంతో ద‌క్షిణ‌కొరియాలో తీవ్ర రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డింది. ప‌లు కేసుల్లో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సియోల్ కోర్టు ఇటీవ‌ల ఇచ్చిన స‌మ‌న్ల‌ను యూన్ బేఖాత‌రు చేశారు. మూడు సార్లు ఆయ‌న స‌మ‌న్ల‌ను విస్మ‌రించారు. దీంతో ఇటీవ‌ల సియోల్ కోర్టు.. యూన్ అరెస్టుకు వారెంట్ జారీ చేసింది.

attempt to arrest president South Korea

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.