📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

కొత్త వైరస్ నిజం కాదు: చైనా

Author Icon By Vanipushpa
Updated: January 4, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల చైనాలో కొత్త వైరస్ వచ్చినట్లుగా వస్తున్న వార్తలో నిజం లేదని చైనా తెలిపింది.హెచ్ఎంపీవీ వైరస్ విషయమై వస్తోన్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని చైనా తెలిపింది. చైనాలో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందని కథనాలు వచ్చాయి. దీంతో చైనా విదేశాంగ శాఖ ఈ కథనాలపై స్పందించింది. కొత్త వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న నివేదికలను కొట్టిపారేసింది.
విదేశీయులు తమ దేశంలో పర్యటించేందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సురక్షితమేనని హామీ ఇచ్చింది. చైనా పౌరులతో పాటు తమ దేశంలోని విదేశీయుల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు.

శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల నిర్మూలన, నియంత్రణకు సంబంధించి తమ దేశానికి చెందిన నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత సహజమేనని, అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉందని తెలిపింది.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుందని చెబుతున్నారు. దగ్గు, తుమ్ములతో బాధపడే వారి తుంపర్లు, వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం, కరచాలనం చేయడం, తాకడం వంటి చర్యలతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని డాక్టర్లు చెప్పారు. చిన్న పిల్లలు, వృద్ధులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. 2001లోనే హెచ్ఎంపీవీని గుర్తించారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేదా నిర్దిష్టమైన చికిత్స లేదు. లక్షణాలకు అనుగుణంగా చికిత్స ఉంటుంది.

china new virus fake news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.