📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

కెనడా ప్రధానిగా అనితా ఆనంద్ ?

Author Icon By Vanipushpa
Updated: January 7, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల మనదేశానికి కెనడా దేశానికీ మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్నది. ప్రధాని ట్రూడో నిత్యం ఇండియాపై ఏదో ఒక విషయంలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనితో కెనడా రాజకీయాలపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడోపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయన్ను ఎన్నికలకు ముందే తప్పుకోవాలన్న ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ట్రూడో నిన్న తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు లిబరల్ పార్టీ సిద్దమవుతోంది. ఈ రేసులో భారతీయ మూలాలున్న లాయర్, ప్రస్తుత కేబినెట్ మంత్రి అనితా ఆనంద్ ముందున్నారు.
రాజీనామాకు సిద్దమైన ప్రధాని
తొమ్మిదేళ్ల పదవీకాలం తర్వాత రాజీనామాకు సిద్దమైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో .. తాను పదవీవిరమణ చేస్తానని, అయితే లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని తాజాగా ప్రకటించారు. దీంతో కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ప్రధానమంత్రి, పార్టీ నాయకుడిగా కొనసాగుతారు.

మార్చి 24 వరకు సస్పెండ్ చేసిన పార్లమెంట్ ఏదైనా విశ్వాస ఓట్లు లేదా ఎన్నికల పిలుపులు జరగడానికి ముందు తప్పనిసరిగా పునఃప్రారం భించాల్సి ఉంది. అలాగే తదుపరి ఎన్నికలు మే కంటే ముందుగా జరగవు. అక్టోబర్‌లో షెడ్యూల్ తేదీగా ఉంటుంది. దీంతో ట్రూడో నాయకత్వంలో ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండటానికి నాయకత్వ పోటీని వేగవంతం చేయడం లిబరల్ పార్టీ నేతల లక్ష్యంగా ఉంది. అలాగే ప్రధానిగా భారతీయ మూలాలున్న అనితా ఆనంద్ తో పాటు మెలానీ జోలీ, మార్క్ కార్నీ పోటీ పడుతున్నారు.

భారతీయ మూలాలున్న అనితా ఆనంద్
ఈ క్రమంలో భారతీయ మూలాలున్న అనితా ఆనంద్ పేరు తెరపైకి వస్తోంది. ఓక్‌విల్లే పార్లమెంటు సభ్యురాలు అయిన అనితా ఆనంద్ లిబరల్ పార్టీలో కీలక నేత. ప్రస్తుతం ఆమె రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా కూడా ఉన్నారు. గతంలో రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు.

anita anand canada Indian

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.