📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ఇజ్రాయెల్ మారణ హోమం

Author Icon By Vanipushpa
Updated: January 18, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌పై మరోసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించడానికి కొన్ని గంటల ముందు మారణ హోమాన్ని సృష్టించిందక్కడ. డ్రోన్ దాడులతో కల్లోలాన్ని రేపింది. ఈ ఘటనలో 115 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 31 మంది మహిళలు, 28 మంది పిల్లలు ఉన్నారు. 265 మంది గాయపడ్డారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ అధికార ప్రతినిధి మహ్మద్ బసుల్ తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

నిజానికి- హమాస్‌తో ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇజ్రాయెల్. దీనికి ప్రతిగా ఆ మిలిటెంట్ గ్రూప్ చెరలో బందీలుగా ఉన్న తమ దేశ పౌరులను విడిపించుకోవాలనేది షరతు. దీనికి ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించడానికి కొన్ని గంటల ముందు ఈ గగనతల దాడులు సాగాయి. గాజా ఉత్తరప్రాంతంలోని షేక్ రంద్వాన్‌పై ప్రధానంగా ఈ డ్రోన్ దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 115 మంది పాలస్తీనియన్లు దుర్మరణం పాలయ్యారని మహ్మద్ బసుల్ చెప్పారు. గాజా చరిత్రలో డెడ్లియెస్ట్‌గా అభివర్ణించారు. గాయపడ్డ వారిని అల్- అరబ్ అహ్లి, బాప్టిస్ట్ ఆసుపత్రులకు తరలించారు.

115 people killed Hamas israel attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.