జనవరిలో ప్రమాణస్వీకారం చేయనున్న అమెరికా కాబోయి అధ్యక్షుడు ట్రంప్ ఇండియాను హెచ్చరించారు. ఎన్నికలో గెలిచిన ట్రంప్.. పన్నుల అంశంలో భారత విధానాన్ని తప్పుపట్టారు. అమెరికా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాన్ని భారత్ వసూల్ చేస్తున్నదని, దానికి ప్రతీకారంగా మేం కూడా ట్యాక్స్‌ను వసూల్ చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఒకవేళ భారత్ పన్ను వసూల్ చేస్తే, వాళ్లకు కూడా మేం ట్యాక్స్ వేస్తామని, ఇది ప్రతిచర్యగా ఉంటుందని, దాదాపు అన్ని అంశాల్లో భారత్ అధిక దిగుమతి సుంకాన్ని వసూల్ చేస్తున్నదని, కానీ తామేమీ ట్యాక్స్ వసూల్ చేయడం లేదని ట్రంప్ తెలిపారు. చైనాతో జరిగిన వాణిజ్య ఒప్పందంపై ప్రశ్న వేసిన సమయంలో.. ట్రంప్ ఈ సమాధానం ఇచ్చారు.
ఇండియాతో పాటు బ్రెజిల్ కూడా తమ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాన్ని వసూల్ చేస్తున్నట్లు ట్రంప్ ఆరోపించారు. రెండు దేశాలమధ్య స్నేహ సంబంధానికి తాము కట్టుబడి ఉన్నట్లు ట్రంప్ అన్నారు. అయితే పన్నుల విషయంలో భారత్ వైఖరి మారాలని ఆయన పేర్కొన్నారు.
ఇండియాకు ట్రంప్ వార్నింగ్
By
Vanipushpa
Updated: December 18, 2024 • 10:52 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.