ఆస్ట్రేలియా పేరెంట్‌ వీసాకు మరింత సమయం

Read Time:  1 min
హెచ్-1బీ జాబ్స్ భర్తీలో బ్యాంకింగ్, వెనుకంజలో టెక్ దిగ్గజాలు
హెచ్-1బీ జాబ్స్ భర్తీలో బ్యాంకింగ్, వెనుకంజలో టెక్ దిగ్గజాలు
FONT SIZE
GET APP

గత కొన్నిసంవత్సరాల నుంచి విదేశీ విద్యకు, ఉపాధికి డిమాండ్ పెరిగింది. మన దేశం నుంచి ఏటా ఈ సంఖ్య పెరిగిపోతున్నది. దీనితో వీసా లను పొందేందుకు కష్టంగా మారింది. తాజాగా ఆస్ట్రేలియా జనరల్‌ పేరెంట్‌ వీసా కోసం 31 ఏండ్లు, కాంట్రిబ్యూటరీ పేరెంట్‌ వీసా కోసం 14 ఏండ్లు నిరీక్షించాల్సి ఉందని తాజా నివేదిక తెలియజేసింది. దీంతో ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో గత మూడేండ్లలో 2300 మంది మరణించినట్టు ఆస్ట్రేలియా హోం శాఖ తెలిపింది.

పేరెంట్‌ వీసాలకు పెరిగిన డిమాండ్‌
ఆస్ట్రేలియా పేరెంట్‌ వీసాలకు డిమాండ్‌ బాగా పెరగడంతో దీని సంఖ్యను ఏడాదికి 4500 నుంచి 8500కు పెంచారు. అయితే ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. వీటి కోసం వచ్చే దరఖాస్తులు మాత్రం అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. 2023లో వీటి దరఖాస్తులు 1.5 లక్షలకు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా పేరెంట్‌ వీసాలకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతున్నది. దీనితో పాటు దాని నిరీక్షణ సమయం కూడా అనూహ్యంగా పెరిగిపోయింది.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.