నేడు క్యాట్‌లో తెలంగాణ, ఏపీ ఐఏఎస్‌ల పిటిషన్ల పై విచారణ

Inquiry on petitions of Telangana and AP IAS in CAT today

హైదరాబాద్‌: కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలతో తెలంగాణ, ఆంధ్రాలో కొనసాగుతున్న ఐఏఎస్,ఐపీఎస్‌ కేడర్​ అధికారులు పునర్విభజన యాక్ట్​ ప్రకారం తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీఓపీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఓపీటీ కార్యదర్శి ఆర్డర్స్​ సైతం జారీ చేశారు. ఈ క్రమంలోనే డీఓపీటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏపీ, తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై క్యాట్‌లో మంగళవారం విచారణ జరగనుంది.

గతంలో ఏపీకి కేటాయించి ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌ ఆఫీసర్స్​ వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి, ఐపీఎస్‌ కేడర్ అంజనీ కుమార్, అభిలాశ్​ బిస్త్, అభిషేక్‌ మహంతి ఉన్నారు. ఇక ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన వారిలో ఐఏఎస్‌ ఆఫీసర్లు సృజన, శివశంకర్, హరికిరణ్‌ ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు అప్లికేషన్​ పెట్టుకున్న ఎస్‌.ఎస్‌.రావత్, అనంతరాము అభ్యర్థనలను డీవోపీటీ రిజక్ట్​ చేసింది. దీంతో వీరిద్దరూ ఏపీలోనే కొనసాగనున్నారు. కాగా, క్యాట్ ఐఏఎస్‌ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుందా? లేదా అనేది నేడు తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. Read more about un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. Congress has not approved a new military support package for ukraine since october.