కేంద్రం గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల

Central Government has released huge funds to the Telugu States

తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయింపులు చేసింది. ఏపీకి 498 కోట్లు,తెలంగాణకి 516 కోట్ల నిధులు విడుదల చేసింది. ఏపీలో 200.06 కిమీ పొడవైన 13 రాష్ట్ర రహదారులకు కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి నుంచి నిధులు కేటాయించారు. గుంటూరు నల్లపాడు రైల్వే మార్గంలో శంకర్ విలాస్ ఆర్ ఓబీ ని నాలుగు వరుసల నిర్మాణానికి 98 కోట్లు కేటాయింపులు చేశారు.

తెలంగాణలో NH 565లోని నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య 14 కి.మీ పొడవు, 4-లేన్ బైపాస్ నిర్మాణానికి 516 కోట్లు మంజూరు చేసింది కేంద్రం. బైపాస్ రోడ్డు నిర్మాణంతో నల్గొండ టౌన్ కి ట్రాఫిక్‌ తగ్గనుంది. నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య పెరగనుంది కనెక్టివిటీ. అటు ఏపీ తెలంగాణ మధ్య కీలకమైన జాతీయ రహదారిగా ఉంది NH 565. తెలంగాణలోని నకిరేకల్ వద్ద NH 65 తో జంక్షన్ నుండి ప్రారంభమై నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం కనిగిరి పట్టణాల గుండా వెళుతోంది NH 565.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 10060 seconds