తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచే దిశగా ‘Indira Giri సోలార్ జల వికాసం’ పథకాన్ని వేగవంతంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు కీలక సూచనలు చేశారు. ఈ పథకం ద్వారా గిరిజనులకు ఆదాయం కల్పించడంతో పాటు, వారి భూములను సాగులోకి తేవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టు కోసం రూ.12,500 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించనున్నట్లు భట్టి తెలిపారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ Indira Giri గిరిజనుల కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదని ఆయన పేర్కొన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టం కింద గిరిజనులకు కేటాయించిన భూములను సాగులోకి తీసుకురావడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని వివరించారు.ఈ ప్రాజెక్టు కోసం రూ.12,500 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించనున్నట్లు భట్టి తెలిపారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ గిరిజనుల కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదని ఆయన పేర్కొన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టం కింద గిరిజనులకు కేటాయించిన భూములను సాగులోకి తీసుకురావడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని వివరించారు

గిరిజన సంక్షేమంపై ప్రభుత్వ దృష్టి
ఈ పథకం అమలు ప్రక్రియలో జియాలజికల్ సర్వే, బోర్లు వేయడం, సోలార్ పంపు సెట్లు బిగించడం వంటి అన్ని పనులు ఒకే ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించారని చెప్పారు. దీంతో పనులలో జాప్యం లేకుండా, గిరిజన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకం అమలు సాగుతుందని తెలిపారు. ఉద్యానవన శాఖ ఈ పథకం అమలులో కీలక పాత్ర పోషించనుందని భట్టి పేర్కొన్నారు.గిరిజనులు అవకాడో, వెదురు వంటి వాణిజ్య పంటలు సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందగలరని భావిస్తున్న ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల్లో ఈ పంటల సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు స్టడీ టూర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ పంటలు పూర్తి ఆదాయం ఇవ్వడానికి కనీసం మూడు సంవత్సరాల సమయం పడతుందని, ఆ సమయంలో గిరిజనుల ఆదాయాన్ని నిలబెట్టేందుకు అంతర పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భట్టి చెప్పారు.మొదటిగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్లానియా, అటవీశాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, గిరిజనశాఖ కమిషనర్ శరత్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముశారఫ్ ఫరూకి, ఉద్యానవన శాఖ కమిషనర్ యాస్మిన్ భాష తదితర అధికారులు పాల్గొన్నారు.
Read more :Gold Price : ప్రతీకారం ఎఫెక్ట్..గోల్డ్ ప్రియులకు షాక్