India ready to help Myanmar.. PM Modi

PM Modi : మయన్మార్‌కు సాయం చేయడానికి భారత్‌ సిద్ధంగా ఉంది: ప్రధాని మోడీ

PM Modi : ప్రధాని మోడీ ప్రస్తుతం బ్యాంకాక్‌లో బిమ్స్‌టెక్‌ సదస్సు నిమిత్తం థాయ్‌లాండ్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ థాయ్‌లాండ్‌లో బర్మా సైనిక ప్రభుత్వ అధినేత జనరల్‌ మిన్‌ అంగ్‌ హ్లాయింగ్‌తో భేటీ అయ్యారు. భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న మయన్మార్‌ను ఆదుకొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆ దేశాన్ని ఆదుకోవడానికి భారత్‌ అన్నిరకాల సాయాలు అందిస్తోందని తెలిపారు. ఇక, బ్యాంకాక్‌లో బిమ్స్‌టెక్‌ సదస్సు సందర్భంగా సీనియర్‌ జనరల్‌ మిన్‌ అంగ్‌ హ్లాయింగ్‌తో భేటీ అయ్యాను. భూకంపంలోని మృతిచెందిన బాధితులకు మరోసారి సంతాపం తెలిపాను. ఈ కఠిన సమయంలో మయన్మార్‌లోని మన సోదర సోదరీమణులను ఆదుకొనేందుకు అన్నిరకాల సాయం చేస్తున్నాం. ఇదే సమయంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించాం. ముఖ్యంగా అనుసంధాన, సామర్థ్యాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటివి చాలా అంశాలపై మాట్లాడుకొన్నాం అని ప్రధాని ఎక్స్‌లో చేసిన పోస్టులో వెల్లడించారు.

Advertisements
మయన్మార్‌కు సాయం చేయడానికి భారత్‌

భారత్‌కు చెందిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఆ దేశంలో సహాయక చర్యలు

కాగా, 2021లో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత తొలిసారి జనరల్‌ మిన్‌ అంగ్‌తో భారత ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి. ఈసందర్భంగా భారత సాయానికి మయన్మార్‌ కృతజ్ఞతలు తెలిపింది. మయన్మార్‌ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య నిన్ననే 3 వేలు దాటేసింది. భారత్‌కు చెందిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పెద్దసంఖ్యలో ఆ దేశంలో సహాయక చర్యలు చేపట్టాయి. ఆ దళం డిప్యూటీ కమాండర్‌ కునాల్‌ తివారీ ఈ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 80 మంది సిబ్బంది, నాలుగు జాగిలాలు, రిగ్గింగ్‌, లిఫ్టింగ్‌, కటింగ్‌, బ్రిడ్జింగ్‌ పరికరాలను మోహరించారు. తమకు స్థానికుల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభిస్తోందని తివారీ పేర్కొన్నారు.

Related Posts
‘White T-shirt Movement’ : ‘తెల్ల టీషర్ట్’ ఉద్యమం ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
'White T shirt Movement'

బిహార్ రాష్ట్రంలోని యువత సమస్యలపై దృష్టిపెట్టేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘తెల్ల టీషర్ట్’ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమం ద్వారా యువత ఎదుర్కొంటున్న వలస Read more

బాంబు బెదిరింపు..శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్‌: దేశంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. తాజాగా బాంబు బెదిరింపులతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి Read more

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం

జనవరి 10 న పెండింగ్ వైద్య బిల్లులపై ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసిన తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తన్హా) సభ్య ఆసుపత్రులు సోమవారం తమ నిరసనలను విరమించుకుని, Read more

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త
AP Sarkar good news for une

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నైపుణ్యాలను పెంపొందించి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ట్రెయిన్ అండ్ హైర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×