71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో (71st National Film Awards 2025) నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) ఉత్తమ తెలుగు ఫీచర్ చిత్రంగా ఎంపిక కావడం తెలుగు చిత్రసీమకు గర్వకారణంగా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి తన సాధనకు జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపుతో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. భగవంత్ కేసరి ఓ మాస్ మసాలా కమర్షియల్ మూవీగా కాకుండా, సామాజిక సందేశాన్ని బలంగా చెప్పే సినిమా కావడం విశేషం.
భావోద్వేగంతో స్పందించిన దర్శకుడు
ఈ సందర్భంగా అనిల్ రవిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ – ‘నా కెరీర్‌లో ఇది విభిన్న ప్రయోగం. కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఒక సరికొత్త విషయాన్ని తెరపై చూపించాలన్న నా కోరికను భగవంత్ కేసరి సినిమాతో నెరవేర్చాను. ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు స్వీకరించడమే కాక, జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. సినిమాలో చూపించిన భావోద్వేగాలు, మానవీయ విలువలు, మహిళలపై అవగాహన పెంపొందించే విధానం విమర్శకుల ప్రశంసలకు కూడా పాత్రమయ్యాయి.
బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ ప్రాజెక్టులో నందమూరి బాలకృష్ణ తనపై పూర్తిగా నమ్మకముంచి అండగా నిలిచినందుకు దర్శకుడు అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ సినిమాని అంగీకరించి, విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లిన హీరో బాలయ్య గారు లేకపోతే ఈ స్థాయికి రాగలిగే అవకాశం ఉండేది కాదు. ఆయన నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు’ అని చెప్పారు. ఈ విజయంతో అనిల్ రవిపూడికి దర్శకుడిగా మరింత గౌరవం లభించింది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సిద్ధమవుతున్నట్లు అనిల్ సంకేతాలు ఇస్తున్నారు.
Read Also ; 71st National Film Awards 2025: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో దుమ్ములేపిన తెలుగు చిత్రాలు