हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Imanvi Esmail: సోష‌ల్ మీడియా ట్రోల‌ర్లకు గట్టిగా బుద్ది చెప్పిన ఇమాన్వీ

Sharanya
Imanvi Esmail: సోష‌ల్ మీడియా ట్రోల‌ర్లకు గట్టిగా బుద్ది చెప్పిన ఇమాన్వీ

ప్రముఖ నటుడు ప్రభాస్ సరసన ఫౌజీ సినిమాలో నటిస్తున్న యువ నటి ఇమాన్వీ ఎస్మాయిల్ ఇటీవల తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తాను పాకిస్తాన్ సైనికాధికారిణి కుమార్తె అనే పేరుతో సోషల్ మీడియాలో విస్తరిస్తున్న తప్పుడు వార్తలపై ఆమె సోష‌ల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. కావాల‌నే ట్రోల‌ర్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వ్యాప్తి చేసిన‌ట్లు ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇమాన్వీ తన సోష‌ల్ మీడియా వేదికగా

ఇమాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక సుదీర్ఘ భావోద్వేగపూరిత పోస్ట్‌ను పోస్ట్ చేస్తూ ఇలా పేర్కొన్నారు.
నేను పాకిస్థానీ సైనికాధికారి కూతురిన‌న్న‌ది ప‌చ్చి అబద్ధం. ఆ దేశంతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు.  ఆన్‌లైన్‌లో ట్రోల‌ర్లు ఆ విష‌యాన్ని కావాల‌నే వ్యాప్తి చేశారు. మా త‌ల్లిదండ్రులు లాస్ ఏంజిలిస్‌కు వ‌ల‌స వెళ్లారు. నేను అక్క‌డే పుట్టాను. అక్క‌డే చ‌దివాను. స్ట‌డీస్ పూర్త‌యిన త‌ర్వాత న‌టిగా, డ్యాన్స‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించాను. సినిమా నా జీవితంలో ఎంతో ప్ర‌భావాన్ని చూపింది. భార‌తీయ‌త‌, భార‌త సంస్కృతి నా ర‌క్తంలోనే ఉన్నాయి.  నేను భార‌తీయ‌ అమెరిక‌న్‌ని అని గ‌ర్వంగా చెబుతాను. హిందీ, తెలుగు, గుజ‌రాతీ, ఇంగ్లిష్ మాట్లాడే భార‌త సంత‌తి అమ్మాయిని నేను. కొన్ని పేరున్న వార్త సంస్థ‌లు కూడా నా విష‌యంలో క‌నీస ప‌రిశోధ‌న చేయ‌కుండా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేయ‌డం బాధాక‌రం. సోష‌ల్ మీడియాను మంచి కోసం ఉప‌యోగించండి. ఈ బాధాక‌ర స‌మ‌యంలో ద్వేషాన్ని కాకుండా ప్రేమ‌ను వ్యాప్తి చేయండి అని ఇమాన్వీ త‌న పోస్టులో రాసుకొచ్చారు. ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిపై స్పందించిన ఆమె, తీవ్రంగా ఖండిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Read also: Meenakshi Chaudhary: శ్రీవారిని దర్శించుకున్నమీనాక్షి చౌదరి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870