I am not a terrorist, I am a politician.. Malik

Yasin Malik : నేను ఉగ్రవాదిని కాదు..రాజకీయ నాయకుడిని: మాలిక్‌

Yasin Malik: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సుప్రీం కోర్టు విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఉగ్రవాది అంటూ సీబీఐ చేసిన ఆరోపణలను మాలిక్‌ తోసిపుచ్చాడు. తాను రాజకీయ నాయకుడినని.. ఉగ్రవాదిని కాదని యాసిన్‌ మాలిక్‌ పేర్కొన్నాడు. గతంలో తనతో ఏడుగురు ప్రధానులు చర్చలు జరిపారని వెల్లడించాడు. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-యాసిన్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిందే తప్ప ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చలేదని అన్నాడు.

Advertisements
నేను ఉగ్రవాదిని కాదు రాజకీయ

35 ఏళ్ల నాటి ఉగ్రవాద కేసుల విచారణను తిరిగి ప్రారంభించారు

1994లో తనకు 32 కేసులలో బెయిల్ ఇచ్చారని.. కేసులను కూడా కొనసాగించలేదని గుర్తు చేసుకున్నాడు. గతంలో ప్రధానులుగా పనిచేసిన పీవీ నరసింహారావు, హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ హయాంలోనూ తన సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేళ్లలోనూ మునుపటి విధానాన్నే అనుసరించారని.. కానీ, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా 35 ఏళ్ల నాటి ఉగ్రవాద కేసుల విచారణను తిరిగి ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

మాలిక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు

1989లో జమ్మూలో అతడిపై నమోదైన రెండు కేసుల్లో విచారించడానికి మాలిక్‌ను అక్కడి కోర్టులో హాజరుపరచాలని అధికారులు చేసిన ప్రతిపాదనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ఆ కేసులకు సంబంధించిన విచారణను జమ్ము కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని కోరింది. మాలిక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నందున అక్కడికి వెళ్తే.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని సీబీఐ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు విన్నవించారు. ఈ క్రమంలో మాలిక్‌ మాట్లాడుతూ..తానేమీ ఉగ్రవాదిని కాదంటూ వ్యాఖ్యానించాడు.

Related Posts
కార్యకలాపాలను విస్తరించిన పేయిన్‌స్టాకార్డ్
Paynstockard expanded operations

హైదరాబాద్: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేయిన్‌స్టాకార్డ్ ఈరోజు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తన కొత్త, అత్యాధునిక కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రాండిక్స్ ఇండియా అపెరల్ Read more

CM Revanth Reddy : కారుణ్య నియామకాలపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు: సీఎం రేవంత్‌ రెడ్డి
BRS has no right to speak on compassionate appointment.. CM Revanth Reddy

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో పాల్గొని బిల్డ్‌ నౌ పోర్టల్‌ ను ప్రారంభించారు. Read more

BYD: తెలంగాణలో బీవైడీ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ పెట్టుబడులు
BYD Electric Manufacturing Company Investments in Telangana

BYD: చైనాకు చెందిన దిగ్గజ ఆటోమోటివ్ సంస్థ బీవైడీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే Read more

పీవీ కూడా మణిపూర్ లో పర్యటించలేదు: బీరేన్ సింగ్
manipur cm

గత ఏడాదిన్నరగా మణిపూర్ లో జాతులమధ్య జరుగుతున్న హింసలో వందలాది మంది జనం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి మణిపూర్ రగిలిపోతున్నది. ప్రజలు ఆ గాయం నుంచి ఇంకా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×