Hydra demolition in Manikonda

మణికొండలో హైడ్రా కూల్చివేతలు..

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మణికొండలోని నెక్నాంపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపటడ్డంతో స్థానికులు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. రంగనాథ్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా బృందం శుక్రవారం ఉదయం నుంచే భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్రమ కూల్చివేతలు చేపట్టారు. చెరువులు, కుంటలు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని హైడ్రా కమిషనర్‌ తెలిపారు.

image
image

కాగా, గండిపేట జలాశయం దిగువన నార్సింగిలో రాజపుష్ప సంస్థ నది పక్కన నిర్మాణ పనులు చేపట్టింది. ఈ క్రమంలో సదరు సంస్థ నదిని ఆక్రమిస్తున్నదని హైడ్రాకు ఫిర్యాదు వెళ్లింది. కమిషనర్‌ రంగనాథ్‌ రెండు వారాల కిందట క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మూసీ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. నది 40 అడుగుల పొడవున ఆక్రమణకు గురైందని, ఆ ప్రాంతంలో 30 అడుగుల ఎత్తున మట్టి నింపారని తేలింది. అదే రోజున ఆయన ఆక్రమణపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు.

తప్పును సరిదిద్దాలని నిర్మాణ సంస్థకు సూచించారు. ఆ మేరకు వ్యర్థాల తొలిగింపు జరుగుతున్నట్లు హైడ్రా గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. వరుస తనిఖీలు, విచారణ కార్యక్రమాలతో నెక్నాంపూర్‌ చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను పూజ హోమ్స్‌ సంస్థ తొలిగించినట్లు వెల్లడించింది. శంషాబాద్‌ గొల్లవారికుంటలోని అక్రమ లేఅవుట్‌పై విచారణ కొనసాగుతున్నదని, త్వరలోనే చర్యలుంటాయాని గుర్తు చేసింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు ఉంటాయని నిన్ననే హైడ్రా ఓ ప్రకటనలో తెలిపింది. నేడు ఆ మేరకు చర్యలు చేపట్టడం గమనార్హం.

Related Posts
దేశ ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్
ఎయిమ్స్‌ ఎమర్జెన్సీలో మాజీ ప్రధాని

డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. బాల్యం నుంచి విద్యపై ఆసక్తి కలిగి ఉన్న ఆయన, పంజాబ్ విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్ Read more

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు
Imposition of President Rule in Manipur

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ ఇంఫాల్: దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. Read more

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య
AI Study

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య.తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త ప్రయోగాలను ప్రారంభిస్తోంది. విద్యార్థుల పఠన సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో, ప్రభుత్వ పాఠశాలల్లో Read more

సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్
సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్

1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జ్ఞానేష్ కుమార్ ను Read more