వరల్డ్ జూనియర్ 10కే రన్(10K run)కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. వచ్చే నెల 1వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్‌ను నిర్వహిస్తున్నారు. ఈమేరకు గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్సలో ఆసియా క్రీడల మెడలిస్ట్, ప్రముఖ అథ్లెట్ అగసర నందిని ఈ రన్ పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌లో తొలిసారి పిల్లల కోసం ఈ టైమ్డ్ రన్‌ను నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. పిల్లలకు బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ కలిగించడానికి ఇలాంటి రన్‌లు బాగా ఉపయోగపడతాయని చెప్పింది. ఈ రన్‌లో తల్లిదండ్రులు తమ పిల్లలను భాగస్వాములను చేయాలని కోరింది.
Read Also: Hyderabad: సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ
అండర్-3 నుంచి అండర్-18 వయసు మధ్య పిల్లలు
అనంతరం రన్‌ను నిర్వహిస్తున్న స్పాట్‌ఆన్ సంస్థ సీఈఓ రోహిత్ మిశ్రా మాట్లాడుతూ అండర్-3 నుంచి అండర్-18 వయసు మధ్య పిల్లలు ఈ రన్‌లో పాల్గొనవచ్చనని తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద ఈ రన్‌ను నిర్వహిస్తున్నామని, ఇందులో 84 ప్రైజ్ కేటగిరీలు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా భరత్ రెడ్డి, రన్ క్యూరేటర్ రుచి శర్మ తదితరులు పాల్గొన్నారు. మీరు, రియాన్, సిల్వర్ ఓక్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కొల్లూరు, పటాన్‌చెరువ్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్‌తో పాటు పలువురు విద్యార్థులు ఈ రన్‌లో పాల్గొంటున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: