హైదరాబాద్ నగరంలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ‘సామాజిక న్యాయ సమర భేరి’ సభ భారీ ట్రాఫిక్ (Heavy traffic) ఇబ్బందులకు కారణమైంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. దీంతో సభ అనంతరం నగరంలోని ప్రధాన రోడ్లు నిండిపోయాయి.సాయంత్రం 5 గంటల నుంచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటికెళ్లే ప్రయత్నంలో రోడ్లపై గంటల తరబడి నిలిచిపోయారు. ఆఫీసుల నుంచి బయటకు వచ్చిన ప్రజలు ట్రాఫిక్‌లో నలిగిపోయారు. వాహనాలు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు.
ముందస్తుగా ట్రాఫిక్ ఆంక్షలు – అయినా ఉపశమనం లేనే లేదు
ట్రాఫిక్ పోలీసులు ముందుగానే ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నియంత్రణ కొనసాగింది. అయినా వాహనాల రద్దీకి అంతులేకపోయింది. ముఖ్యంగా ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌తో నిండిపోయాయి.లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి, పంజాగుట్ట, రవీంద్రభారతి మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం దాకా వచ్చే వాహనాలను ఇతర దారుల్లోకి పంపించారు. నాంపల్లి మీదుగా ఆర్టీసీ బస్సులను మళ్లించారు.
ప్రత్యామ్నాయ మార్గాలను సూచించిన పోలీసులు
ఖైరతాబాద్ ఫ్లైఓవర్, అబిడ్స్, బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్ వంటి ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు ప్రజలను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లమన్నారు. కానీ అనేకరిమార్గాల్లో కూడా ట్రాఫిక్ జాం తప్పలేదు.పౌరులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలు, సమయపాలనను పరిగణలోకి తీసుకోకుండా సభలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
Read Also : Pulivarthi Nani : తిరుపతి రూరల్ లో పులివర్తి నాని పర్యటన