జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్ షాపులు(Wine shops), బార్లు నాలుగు రోజుల పాటు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 9 సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 11 సాయంత్రం 5 గంటల వరకు మద్యం(Wine shops) అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అదనంగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు రోజున కూడా వైన్స్ షాపులు బంద్‌గా ఉంటాయని వెల్లడించారు.
Read Also: Hyderabad Drugs Case: ఓవర్‌డోస్‌తో యువకుడి మృతి .. రాజేంద్రనగర్‌లో విషాద ఘటన
చట్టపరమైన ఆధారాలతో నిషేధం
ఈ నిషేధానికి 1968 ఎక్సైజ్ చట్టం(Excise Act) సెక్షన్ 20, అలాగే ప్రజాప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 135-C ప్రకారం ఆధారం ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతీ తెలిపారు. ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు నియంత్రించడం చట్టపరమైన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఉల్లంఘనలపై కఠిన చర్యలు
నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మద్యం కారణంగా జరిగే గొడవలు, వివాదాలను నివారించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. చట్టం, శాంతిభద్రతలు కాపాడడంలో ఈ నిషేధం కీలకమని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ వేడి పెరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించబడుతోంది. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యనే ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
హోరాహోరీ ప్రచారం – ఆరోపణల పర్వం
ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ పార్టీలు పరస్పరం డబ్బు పంపిణీ ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: