📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Telugu News: Crime-కోకాపేట్ లో భర్తను హతమార్చి భార్య

Author Icon By Pooja
Updated: September 19, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంసారం సాగరం అన్నారో కవి. సముద్రాన్ని అయినా ఈదగలం కానీ, ఈ సంసారాన్ని ఈదలేమని అనేకుల భావన. భార్యాభర్తలు అన్నాక అలకలు, గొడవలు, మనస్పర్థలు అన్నీ సహజమే. కానీ అవి తెగేంతవరకు లాగకూడదు. లేదా చంపేంతలా ద్వేషించకూడదు. ఇష్టం లేకపోతే, కలిసి జీవించలేకపోతే విడిపోవచ్చు. కానీ చంపే హక్కు ఎవరికీ లేదు. అక్రమసంబంధాల వల్లో.. అనుమానాలు.. క్షణికావేశాలు కారణాలు ఏమైనా ఇటీవల చంపుకోవడాలు, ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతున్నది. సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాం? కాస్త కష్టం వస్తే చంపేయడమో, చావడమో చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఆలోచించాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఓ భార్య తన భర్తను హతమార్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

చిన్నపాటి గొడవ హత్యకు దారి..

హైదరాబాద్ కోకాపేట్ లో నివాసం ఉంటున్న కృష్ణజ్యోతి బోరా, భరత్ బోరా భార్యాభర్తలు. వీరి స్వస్థలం అస్సాం రాష్ట్రం(Assam State). బతుకుదెరువు కోసం కోకాపేటలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు స్థానికంగా కార్మికులుగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. అది చిలికిచిలికి గాలివానగా మారింది. దీంతో ఒకరిపై ఒకరుడు దాడులు చేసుకోవడం ఆరంభించారు. ఈ క్రమంలో ఆవేశంతో భార్య కృష్ణజ్యోతి బోరా కత్తితో భర్తపై దాడి చేసింది. దీంతో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణరక్షణ కోసం గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి, రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో భరత్ బోరా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మద్యంకు అలవాటు పడ్డ భార్య.. ఆపై ఆత్మహత్య

మన సమాజంలో మహిళల కంటే పురుషులే మద్యం అధికంగా సేవిస్తుంటారు. మద్యం తాగే మహిళలు ఉన్నా.. ఆ సంఖ్య తక్కువే. అయితే ఓ భార్యమణి ఏకంగా మద్యానికి బానిసై, ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్లోని గోల్నాకకు చెందిన భవాని అనే మహిళకు మద్యం సేవించే అలవాటు ఉంది. భార్య భవాని, సాయికుమార్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. భర్త సాయికుమార్ భార్యను మద్యం(Alcohol) సేవించవద్దని చెప్పేవాడు. భవానికి చాలాకాలంగా మద్యం అలవాటు ఉంది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలు ఎక్కువ కావడంతో భవాని పుట్టింటికి వెళ్లిపోయింది.

మినీట్యాంక్ బండ్లో దూకిన భార్య

కుటుంబ పెద్దల సమక్షంలో భార్యాభర్తల మద్ద సంప్రదింపుల తర్వాత ఆమె తిరిగి ఇటీవలే భర్త వద్దకు వచ్చింది. అయినా భవాని మద్యం అలవాటు మానుకోలేదు. రాత్రి భవాన్ని మరోసారి మద్యం సేవించి ఇంటికి వచ్చింది. దీంతో భర్త సాయికుమార్ ఆమెను తీవ్రంగా మందలించాడు. భర్త తిట్టడంతో మనస్తాపం చెందిన భవాని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. నేరుగా సరూర్ నగర్ మినీట్యాంక్ బండ్కు చేరుకుని అందులో దూకినట్లు పోలీసులు తెలిపారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంక్ బండ్లో అర్థరాత్రి వరకు వెతికినా భవానీ ఆచూకీ లభించకపోవడంతో ఆమె మరణించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ సంఘటన ఎక్కడ జరిగింది?
హైదరాబాద్‌లోని కోకాపేట్ ప్రాంతంలో జరిగింది.

ఈ కేసు దర్యాప్తు ఎవరి ఆధీనంలో ఉంది?
స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/drug-prevention-is-everyones-responsibility/hyderabad/550145/

Google News in Telugu Hyderabad Crime News Kokapet Incident Kokapet Murder Latest News in Telugu Telangana crime updates wife kills husband

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.