News Telugu: Weather: హైదరాబాద్‌ను వణికిస్తున్న చలి..

Read Time:  1 min
Weather: హైదరాబాద్‌ను వణికిస్తున్న చలి..
Weather: హైదరాబాద్‌ను వణికిస్తున్న చలి..
FONT SIZE
GET APP

Weather: హైదరాబాద్‌లో (Hyderabad) చలి తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో నగరవాసులు వణికిపోతున్నారు. తెల్లవారుజామున చలిగాలులు ఊపిరి బిగపట్టేలా చేస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, శనివారం హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణ స్థాయికంటే తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

Read also: Weather Update:మొంథా తుఫాన్‌ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత

Weather: హైదరాబాద్‌ను వణికిస్తున్న చలి..

Weather: హైదరాబాద్‌ను వణికిస్తున్న చలి..

చలి మరింతగా పెరగడంతో

Weather: రాత్రి వేళల్లో చలి మరింతగా పెరగడంతో ప్రజలు బయటకు వెళ్లడం మానేస్తున్నారు. ఉదయం పూట మంచు ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో చలి మరింత ఎక్కువగా ఉంది. పటాన్‌చెరులో 14 డిగ్రీలు, దుండిగల్‌లో 15, హయత్‌నగర్‌లో 17, హకీంపేటలో 17.1, రాజేంద్రనగర్‌లో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ నిపుణులు రాబోయే కొన్ని రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.