హైదరాబాద్ (Hyderabad Rains) నగరాన్ని బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షం అనేక ప్రాంతాల్లో జనజీవితాన్ని పూర్తిగా అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఉప్పల్, హబ్సిగూడ, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం తాళలేని విధంగా కురిసింది. వీధులన్నీ జలమయమై ట్రాఫిక్ స్తంభించిపోయింది.ఉప్పల్ నుంచి హబ్సిగూడ మార్గంలో వర్షపు నీరు నిలిచిపోయింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా దాకా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్‌బీ వైపు వెళ్లే వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద పరిస్థితి మరింత భయంకరంగా మారింది. అక్కడ రోడ్డు మీద నీరు నదిలా ప్రవహిస్తోంది.
నాలాల నుంచి మురుగు నీరు ఉప్పొంగుతోంది
మలక్‌పేట, మూసారాంబాగ్ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకాస్త దారుణంగా ఉంది. అక్కడ రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. నాలాల నుంచి మురుగు నీరు బయటికి పొంగి రోడ్లపైకి వచ్చేసింది. ఇది నగర శుభ్రతపై అనేక ప్రశ్నలు నెలకొల్పుతోంది.రాత్రి పది గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జీహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అవసరం లేకుండా బయటకు రావొద్దని సూచించారు.
షోరూంలో చిక్కుకున్న సిబ్బంది: హైడ్రా జట్టుల రిస్కీ రెస్క్యూ
రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. ఓ కార్ల షోరూమ్ (Car showroom) లోకి నాలుగు అడుగుల వరద నీరు చేరింది. ఈ ఘటనలో సుమారు 30 మంది సిబ్బంది చిక్కుకుపోయారు. వెంటనే పోలీసులకు, డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలకు సమాచారం ఇచ్చారు. హైడ్రా సిబ్బంది చిన్న పడవల సహాయంతో వెనుకవైపు నుంచి వారికి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.వరద ప్రదేశాల్లో దూరంగా ఉండాలని, విద్యుత్ తీగలు తడిసిన చోట్లకి వెళ్ళకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. GHMC మరియు రెస్క్యూ బృందాలు అలర్ట్ మోడ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు.
Read Also : Heavy Rain Alert in AP : మరో 3 రోజులపాటు వర్షాలు