హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి (cotton) కొనుగోళ్లకు సంబంధించి ఈ నెల సోమవారం నుంచి తలపెట్టిన సమ్మె నిర్ణయాన్ని రైతుల ప్రయోజనాల దృష్ట్యా విరమించుకోవాలని జిన్నింగ్ మిల్లుల (Ginning mills)యాజమాన్యాలకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల సమ్మె) విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తేమ శాతం, 7 క్వింటాళ్ల పరిమితితో రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు.
Read Also: Bigg Boss 9: ఈ వారం తాజా ఎలిమినేషన్ లీక్
కేంద్రం వద్ద సమస్యల ప్రస్తావన, డిమాండ్లు
జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కార్యాలయ అధికారులతో మాట్లాడినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ సందర్భంగా ఎల్1, ఎల్2 నిబంధనలతో జిన్నింగ్ మిల్లర్లు పడుతున్న ఇబ్బందులను కేంద్ర అధికారుల దృష్టికి మరోసారి తీసుకెళ్లినట్లు తెలిపారు.
- పరిమితి పెంపు: ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితిని ఎత్తివేసి దాన్ని 12 క్వింటాళ్లకు పెంచేలా కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి కోరారు.
- దిగుబడి గణాంకాలు: కేంద్రం కోరినట్టుగా జిల్లా వారీ సరాసరి పత్తి దిగుబడి గణాంకాలను రూపొందించామని, రాష్ట్ర సరాసరి దిగుబడి ఎకరాకు 11.74 క్వింటాళ్ల వరకు ఉందని వివరించారు.
- విజ్ఞప్తి: తుఫాను, అకాల వర్షాల కారణంగా రైతులు ఇప్పటికే నష్టపోయారని, ఇప్పుడు కేంద్రం నిబంధనల పేరుతో మిల్లర్లను, రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు.
కొనుగోళ్ల పరిస్థితి, మిల్లర్లకు హెచ్చరిక
కేంద్ర అధికారులు సానుకూలంగా స్పందించి సీసీఐ అధికారులను తప్పనిసరి చర్యలు తీసుకునేలా ఆదేశిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 67 వేల మంది రైతుల నుంచి 1.18 లక్షల టన్నుల పత్తిని సేకరించడం జరిగిందన్నారు. కొనుగోళ్లు ఊపందుకునే సమయంలో మిల్లర్లు కొనుగోళ్లు నిలిపివేస్తామని ప్రకటించడం మంచిది కాదన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: