📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News :Hyderabad :ట్రాఫిక్ అస్తవ్యస్తం – మెట్రోలో భారీ రద్దీ

Author Icon By Pooja
Updated: October 6, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్(Hyderabad) రోడ్లు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు దసరా సెలవుల అనంతరం లక్షలాది మంది నగరానికి తిరిగి రావడంతో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద కిలోమీటర్ల మేర హైదరాబాద్ ల్లో (Hyderabad) ట్రాఫిక్ జామ్‌లు కనిపించాయి.
Read also : Vomiting during travel – ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే..

మెట్రోలో పరిస్థితి ఆందోళనకరం

రోడ్లపై సమస్యలతో విసిగిన ప్రజలు మెట్రో సేవలను ఆశ్రయించడంతో స్టేషన్లలో రద్దీ పెరిగింది. ఎల్బీ నగర్, ఉప్పల్, మియాపూర్ వంటి ప్రధాన స్టేషన్లలో టికెట్ కౌంటర్లు, సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ల వద్ద పొడవాటి క్యూలైన్లు ఏర్పడ్డాయి. సాధారణంగా 10 నిమిషాల్లో పూర్తయ్యే ప్రక్రియ గంటకు పైగా పట్టింది. ప్రయాణికుల తాకిడి పెరిగిన సమయంలో కొన్ని స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టులు పనిచేయకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. లగేజీతో ఉన్న వృద్ధులు, మహిళలు, పిల్లలు మెట్లపై తోపులాటలతో నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఊపిరి సలపని రైళ్లు

ప్లాట్‌ఫారాలపై వేచి చూసిన ప్రయాణికులు రైలు వచ్చిన తర్వాత లోపలికి ఎక్కేందుకు మరోసారి పోరాడాల్సి వచ్చింది. ఇప్పటికే నిండిపోయిన రైళ్లలో చోటు లేకపోవడంతో కొన్ని స్టేషన్లలో ప్రయాణికులు ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో అదనపు రైళ్లు నడపాలని ప్రజలు మెట్రో అధికారులను డిమాండ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం పండుగల అనంతరం ఇదే పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల పర్యవేక్షణ పెంచడం, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్, మెట్రో రద్దీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య ఎందుకు పెరిగింది?
భారీ వర్షాలు, దసరా సెలవుల తర్వాత నగరానికి తిరిగి వచ్చిన ప్రజల రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్‌లు పెరిగాయి.

మెట్రో స్టేషన్లలో ఎందుకు ఇంత రద్దీ ఏర్పడింది?
రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఎక్కువగా మెట్రోను ఆశ్రయించడంతో స్టేషన్లలో ఊపిరి సలపని రద్దీ ఏర్పడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :https://epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu DasaraRush HeavyRain HyderabadNews HyderabadTraffic Latest News in Telugu MetroRush Telugu News Today TrafficJam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.