📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Telugu news: Maoists: చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి

Author Icon By Sushmitha
Updated: September 29, 2025 • 1:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మృతి చెందారు. మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా కాంకేర్, గరియాబంద్ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాల రాకను గుర్తించిన నక్సలైట్లు వారిపైకి కాల్పులు జరపగా, భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇరువర్గాల మధ్య గంటలపాటు కాల్పులు కొనసాగాయి.

Read Also: Naegleria fowleri: అమీబాతో కేరళలో 20 మంది మృతి

రివార్డులు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులపై మొత్తం రూ.14 లక్షల రివార్డు ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మావోయిజం అంతరించిపోతుంది: ఐజీ సుందర్‌రాజ్

కాల్పుల ఘటనపై బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(General of Police) సుందర్‌రాజ్ స్పందించారు. మావోయిజం అంతరించిపోయే దశలో ఉందనే వాస్తవాన్ని మావోయిస్టు కార్యకర్తలు అంగీకరించాలని ఆయన అన్నారు. భద్రతా దళాలు మావోయిస్టుల ఏరివేతను మరింత ముమ్మరం చేశాయని ఆయన పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ ఎక్కడ జరిగింది?

కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని దండకారణ్యంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

మృతి చెందిన మావోయిస్టులపై ఉన్న మొత్తం రివార్డు ఎంత?

మృతి చెందిన ముగ్గురిపై భద్రతా దళాలు రూ.14 లక్షల రివార్డు ఉన్నట్లు గుర్తించాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Chhattisgarh Google News in Telugu Kanker Latest News in Telugu maoist encounter Naxalism. reward security forces Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.