📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

HYD: హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే!

Author Icon By Anusha
Updated: December 27, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (HYD) లో, 2026 నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యంగా హైదరాబాద్ (HYD) నగర పోలీసులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. నగరవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాకు తావు లేకుండా ‘జీరో డ్రగ్స్’ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

Read Also: TG: రైతుల కోసం ప్రతి మండలంలో లోకల్ మార్కెట్లు ఏర్పాటు

కొత్తగా వచ్చే వ్యక్తుల వివరాలనూ పరిశీలిస్తున్నారు

ఈ మేరకు బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో హెచ్-న్యూ, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్, వెస్ట్ జోన్ తదితర విభాగాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నగరంలోని పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, ఈవెంట్ వేదికల వద్ద ప్రత్యేక నిఘా బృందాలను మోహరించారు. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లు, ప్రైవేట్ పార్టీలపై కూడా నిఘా కొనసాగుతుంది.

గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలను నిశితంగా గమనిస్తూ, డ్రగ్స్ సరఫరా చేసే వారు, వినియోగించే వారి జాబితాలను సిద్ధం చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు. నగరానికి కొత్తగా వచ్చే వ్యక్తుల వివరాలనూ పరిశీలిస్తున్నారు. వేడుకల సమయపాలన విషయంలోనూ కఠిన ఆంక్షలు విధించారు.డిసెంబర్ 31 రాత్రి జరిగే అన్ని పార్టీలు, ఈవెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే ముగించాలన్నారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే సంబంధిత పబ్‌లు, హోటళ్లు, క్లబ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.

These are the New Year rules in Hyderabad!

అనుమతి ఇస్తే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు

మైత్రీవనం, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, కేబీఆర్ పార్క్ వంటి రద్దీ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, బారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు.నగరవ్యాప్తంగా 120కి పైగా చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. మద్యం సేవించి వాహనం నడిపితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల వరకు జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో డీజే సౌండ్ సిస్టమ్స్‌ను రాత్రి 10 గంటలకే నిలిపివేయాలని, ఇండోర్ ఈవెంట్లలో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించరాదని ఆదేశించారు. పబ్‌లు, క్లబ్‌లలో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగం, అశ్లీల నృత్యాలకు అనుమతి ఇస్తే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ప్రధాన ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై వాహనాల రాకపోకలను నిషేధించనున్నారు.

అయితే విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వేడుకల ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్‌ను మోహరిస్తున్నారు. ప్రతి ఈవెంట్ వద్ద సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరి చేశారు.మద్యం సేవించిన వారు సురక్షితంగా ఇంటికి చేరేందుకు తెలంగాణ ఫోర్-వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ ఉచిత రవాణా సదుపాయాన్ని ప్రకటించింది. 500 క్యాబ్‌లు, 250 బైక్‌లతో ఈ సేవలు అందించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Hyderabad Police latest news New Year 2026 Telugu News VC Sajjanar Zero Drugs Policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.