హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రెండో దశలో ప్రతిపాదించిన కొత్త రూట్లకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (Detailed project reports) పూర్తయ్యాయి. ముఖ్యమైన మార్గాల వివరాలు ఇలా ఉన్నాయి:
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ – ఫ్యూచర్ సిటీ:
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు సుమారు 40 కిలోమీటర్ల మెట్రో లైన్‌ను ప్రణాళిక చేశారు. ఈ మార్గంలో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ స్టేషన్‌ను భూగర్భంగా నిర్మించాలని ప్రతిపాదించారు.
Read Also: Hyderabad Metro: మెట్రో రైలు.. ఎనిమిదేళ్ల ప్రగతికి ప్రతీక!
జేబీఎస్ – శామీర్‌పేట:
జేబీఎస్ నుంచి కార్ఖానా, అల్వాల్, తూంకుంట మీదుగా శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్ల మెట్రో లైన్ ఉండనుంది. హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ రన్‌వే కారణంగా సుమారు 1.5 కిలోమీటర్ల విభాగాన్ని అండర్‌గ్రౌండ్‌గా రూపొందించారు.
జేబీఎస్ – మేడ్చల్:
జేబీఎస్ నుంచి తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, కొంపల్లి మార్గంగా మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల లైన్ ప్రతిపాదించారు.
అనుమతుల దశలో:
ఈ మూడు డీపీఆర్‌లు ప్రస్తుతం కేంద్ర పరిశీలనలో ఉన్నాయి. 2026 మార్చి నాటికి ఆమోదం లభించే అవకాశం ఉందని HAML అధికారులు భావిస్తున్నారు. రెండో దశ అమల్లోకి వస్తే హైదరాబాద్ మెట్రో విస్తరణకు పెద్ద ఊతం లభించడమే కాక రద్దీ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది.
సవాళ్లు:
మెట్రో(Hyderabad Metro) సేవలు విజయవంతంగా నడుస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు మరింత దృష్టిని కోరుతున్నాయి. ముఖ్యంగా
- రద్దీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత
- చివరి మైలు కనెక్టివిటీపైన సరైన దృష్టి లేకపోవడం
- స్టేషన్ల వద్ద ఫుట్‌పాత్‌లు దిద్దుబాటు అవసరం
- పరిశుభ్రత లోపం
- పార్కింగ్ సౌకర్యాల లేమి
ఈ అంశాలు ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: