📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Telugu News: Governor Jishnu Dev-రోడ్డు భధ్రతలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర కీలకం

Author Icon By Pooja
Updated: September 19, 2025 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిల్లలు పాఠశాల నుంచి సురక్షితంగా ఇంటికి చేరాలన్నా, రోగులు సమయానికి ఆస్పత్రికి చేరాలన్నా, ప్రజలు ఒత్తిడి లేకుండా ప్రయాణించాలన్నా ట్రాఫిక్ పోలీసుల పాత్ర ఎంతో కీలకమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో హైదరాబాద్ సిటీ పోలీసు సంయుక్తంగా నిర్వహించిన ట్రాఫిక్ రోడ్డు భద్రతా సమ్మిట్ 2025ను గవర్నర్ జిష్ణుదేవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంబించారు.

ట్రాఫిక్ సమ్మిట్ వివరాలు

ఈ సమ్మిట్ రెండు రోజులపాటు జరగనుంది. ఇందులో నగరంలోని ట్రాఫిక్ నిపుణులు, పరిశ్రమ ప్రముఖులు, విద్యావేత్తలు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు(Traffic regulations) పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యంగా హెచ్సీఎస్సీ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యాసంస్థలు మరియు ఇతరులు ట్రాఫిక్ విభాగానికి సహకరించాలని కోరారు.

ట్రాఫిక్ నిర్వహణలో సవాళ్లు

నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నగరంలో 92 లక్షల వాహనాలు(Vehicles) నమోదు కాగా, రోజుకు 15,005 వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని ఆయన వివరించారు. ట్రాఫిక్ నిర్వహణ నగర భద్రతకు కీలకమని, ప్రజల సహకారంతో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

డేవిస్, హెచ్సీఎస్సీ ట్రాఫిక్ ఫోరం జాయింట్ సెక్రటరీ వి. రాజశేఖరరెడ్డి, ట్రాఫిక్ మరియు ఎల్అండ్ విభాగాల అన్ని డీసీపీలు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సహకారాన్ని పోలీసుల తరఫున ఆయన అభినందించారు.

ట్రాఫిక్ రోడ్డు భద్రతా సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది?
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో జలవిహార్లో జరిగింది.

ఈ సమ్మిట్‌లో ముఖ్య అతిథి ఎవరు?
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-liquor-case-ed-checks-in-5-states-in-ap-liquor-case/andhra-pradesh/550108/

Google News in Telugu Governor Jishnudev Verma Hyderabad Police Road Safety Latest News in Telugu Road Safety Summit 2025 Telugu News Today Traffic Police Role Traffic Safety Hyderabad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.