📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

TGSRTC: రాష్ట్ర ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల నూతన భవనానికి శంకుస్థాపన

Author Icon By Anusha
Updated: July 2, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి

హైదరాబాద్ : తుర్కయంజాల్ మున్సి పాలిటీ పరిధిలో తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ మల్ రెడ్డి (Mal Reddy) రామ్రెడ్డి లు పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసిలో ప్రజారవాణా వ్యవస్థలో 3 లైఫ్ లైన్ గా ఉండి రిటైర్డ్ అయిన వారికి కమ్యూనిటీ హాల్ 5 నిర్మిస్తున్నాం దీనికి తుర్కయంజాల్ మున్సిపాలిటీ నుండి 5 లక్షలు కేటాయించారు. జిల్లా కలెక్టర్ ద్వారా 10 లక్షలు – మంజూరు చేయిస్తాం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగరెడ్డి నుండి నిధులు కేటాయిస్తారు. జీహెచ్ ఎంసీ జోనల్ కమిషనర్ తో మాట్లాడాను ఇక్కడ ఉన్న డ్రైనేజీ నాళా సమస్య పరిష్కారం చేస్తాం ఇక్కడ రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఇందిరమ్మ ఇళ్లు

అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం ఆరోగ్యశ్రీ 5-10 లక్షలకు పెంచుకున్నాం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. సన్న వడ్లు బోనస్ ఇస్తున్నాం రైతులకు రైతు రుణమాఫీ పూర్తి చేశాం. 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా విడుదల చేశాం, దేశంలో ఎక్కడ లేని విధంగా పంట పెట్టుబడి సహాయం అందించాం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, కొత్త యూనిట్లు మంజూరు చేస్తున్నాం. కార్మికుల సంక్షేమానికి మా ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఆర్టీసీ ఉద్యోగులకు (RTC employees) పెన్షన్ లేదు గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యం చేశారు. మేము కొత్త బస్సులు, కొత్త నియామకాలు, కొత్త బస్సు డిపోలు ఇస్తున్నాం ఆర్టీసీ లాభాల్లోకి తీసుకొస్తున్నాం ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల భద్రత ఆర్టీసీ పరిరక్షణ ఈ మూడింటికి ప్రాధాన్యత ఇస్తున్నాం పెదోడికి రవాణా సౌకర్యం ఆర్టీసీ.

TGSRTC:

సబ్ ప్లాన్ కింద కమ్యూనిటీ హాల్

పెద్ద మొత్తంలో ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తున్నాం కొత్త రూట్లలో బస్సులు నడిపిస్తున్నాం 191 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ లో ఉచితంగా ప్రయాణం చేశారు. 6300 కోట్ల రూపాయలు విలువైన ఉచిత బస్సు ప్రయాణం చేశారు.నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుండి ఆర్టీసీతో మంచి సంబంధం ఉండేది, మా గురువు చొక్కరవు ఆర్టీసీ మంత్రిగా ఉండేవారు. ఇంకో గురువు సత్యనారాయణ ఆర్టీసీ చైర్మన్ (RTC Chairman) గా కూడా చేశారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ జీహె చ్ఎంసీ స్పెషల్ సబ్ ప్లాన్ కింద కమ్యూనిటీ హాల్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా మేము ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ బొక్క రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొక్క వంశీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు పాల్గొన్నారు.

Read Also: Sandeep Mathur:దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా అదనపు బాధ్యతలు స్వీకరించిన సందీప్ మాథుర్

#CommunityHall #DrainageIssue #FoundationStone #GHMC #Ibrahimpatnam #Mallareddy #MalReddy #ponnamprabhakar #PublicTransport #RangareddyDistrict #RetiredEmployees #RoadDevelopment #RTCRetireesWelfare** #TelanganaNews #TSRDC #TurkayamjalMunicipality Here are English hashtags with keywords separated by commas based on your content: **#TSRTC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.