హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. టెట్-2026కి భారీగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువు ముగిసేనాటికి 2,37,754 దరఖాస్తులు (applications) వచ్చాయి. టెట్ (TET) పరీక్షకి ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయల నుంచి 71,670 దరఖాస్తులు వచ్చినట్టు పాఠశాల విద్య డైరెక్టర్, టెట్-2026 చైర్‌పర్సన్ నవీన్ నికోలస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read Also: Telangana 3 Parts : మూడు భాగాలుగా తెలంగాణ – సీఎం రేవంత్
పేపర్-1, పేపర్-2 దరఖాస్తుల వివరాలు
శనివారం అర్ధరాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
- పేపర్-1: ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల నుంచి 27,389 దరఖాస్తులు రాగా, ఇతరుల నుంచి 58,149 దరఖాస్తులు కలిపి మొత్తం పేపర్-1కి 85,538 దరఖాస్తులు వచ్చాయి.
- పేపర్-2: ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల నుంచి 44,281 దరఖాస్తులు రాగా, ఇతరుల నుంచి 1,07,935 దరఖాస్తులతో కలిపి మొత్తం పేపర్-2కి 1,52,216 దరఖాస్తులు వచ్చాయి.
పేపర్-1, పేపర్-2కి కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు వచ్చాయి.
ఎడిట్ సౌకర్యం, పరీక్షల షెడ్యూల్
టెట్-2026కి దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తులో తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవడానికి సోమవారం వరకు ఎడిట్ సౌకర్యానికి అవకాశం కల్పించారు. టెట్-2026 నోటిఫికేషన్ వెలువడిన మొదటి రోజు (నవంబర్ 14) నుంచే దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు.
టెట్-2026 పరీక్షలను జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. టెట్-2026 ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్యలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: