📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య

Telugu News: Terrorist: దేశంలో వరుసగా వెలుగు చూస్తున్న ఉగ్ర కుట్రలు

Author Icon By Sushmitha
Updated: November 12, 2025 • 11:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: దేశంలో వరుసగా వెలుగు చూస్తున్న ఉగ్ర(Terrorist) కుట్రలు యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో హైదరాబాద్‌కు చెందిన సమీర్ అహ్మద్, విజయనగరంవాసి సిరాజ్ ఉర్ రహమాన్లు అరెస్టవడం తెలిసిందే. వీరి వద్ద నుంచి పేలుడు పదార్థాలు జప్తు చేయగా, వీరి వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్లు తేలింది. దీని తర్వాత అనంతపురంలో ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్, తాజాగా గుజరాత్‌లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు (హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ సహా) అరెస్ట్ కావడం జరిగింది.

 Read Also: Samantha: బిజినెస్ ఉమెన్‌గా మరో స్టెప్ వేసిన సమంత

Terrorist

వైద్యులే ఉగ్ర కుట్రలో కీలకం

గుజరాత్‌లో అరెస్టయిన హైదరాబాద్ వైద్యుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, జనావాస ప్రాంతాలలోని నీళ్ల ట్యాంకుల్లో విషయం కలిపి సామూహికంగా ప్రజలను అంతమొందించాలని కుట్ర పన్నినట్లు వార్తలు వస్తున్నాయి. చైనాలో(China) వైద్య విద్యను అభ్యసించిన ఇతను రాజేంద్రనగర్‌కు చెందినవాడు. ఈ కుట్ర తర్వాత తాజాగా సోమవారం ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా తొమ్మిది మంది అరెస్టవగా, ఇందులో ముగ్గురు వైద్యులు ఉన్నారు. వీరిలో ఒక మహిళా వైద్యురాలు (షహీన్ షహీద్) పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఏ-మహమ్మద్ తరపున మహిళా కమాండర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణలో ఒక మహిళా వైద్యురాలు కమాండర్‌గా ఉండటం ఇదే తొలిసారి.

ఢిల్లీ పేలుడు, ఆత్మాహుతి దాడి అనుమానం

ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట(Red Fort) వద్ద కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడుకు ఆత్మాహుతి దాడి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడికి పాల్పడింది జైష్-ఏ-మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది, కశ్మీర్‌లోని పుల్వామా నివాసి అయిన డాక్టర్ ఉమర్ నబీగా అనుమానిస్తున్నారు. గతంలో 2005లో బేగంపేట్‌లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడి, 2019 ఫిబ్రవరిలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై ఆదిల్ దార్ అనే ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దేశంలో మళ్లీ ఆత్మాహుతి దాడి జరగడం ఇదే తొలిసారి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Delhi Car Blast doctor terrorists Google News in Telugu Hyderabad terrorism ISIS plot JeM. Latest News in Telugu Suicide Attack Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.