📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Musi Project-సీఎం రేవంత్ రెడ్డి: మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం

Author Icon By Pooja
Updated: September 8, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Musi Project-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.7,360 కోట్ల వ్యయంతో అమలు కానున్న ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి తాగునీటి ప్రాజెక్టు(Godavari Drinking Water Project)ఫేజ్‌-2, 3 పనులు చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఓఆర్‌ఆర్‌ పరిధిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన 15 కొత్త రిజర్వాయర్లను కూడా సీఎం ప్రారంభించనున్నారు.

హ్యామ్ విధానంలో అమలు కానున్న ప్రాజెక్టు

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో అమలు చేయనున్నారు. ఇందులో ప్రభుత్వం 40% పెట్టుబడి పెట్టగా, మిగతా 60% నిధులను కాంట్రాక్టు సంస్థ సమకూర్చనుంది. ఈ ప్రాజెక్టు రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి, అందులో 2.5 టీఎంసీలను మూసీ పునరుజ్జీవానికి కేటాయించనున్నారు. మిగిలిన 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించబడతాయి.

తాగునీటి సరఫరా విస్తరణ

ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2లో భాగంగా రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టిన తాగునీటి సరఫరా ప్రాజెక్టు పూర్తి అయ్యింది. ఇందులో మొత్తం 71 రిజర్వాయర్లు నిర్మించగా, వాటిలో 15 రిజర్వాయర్లను (Reservation) సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించనున్నారు. వీటి ద్వారా సరోర్‌నగర్, ఘట్‌కేసర్, మేడ్చల్, శంషాబాద్ తదితర మండలాల్లోని 25 లక్షల మందికి తాగునీరు అందే అవకాశం ఉంది. అంతేకాక, కోకాపేట్ లేఅవుట్ సమగ్రాభివృద్ధిలో భాగంగా నియోపోలిస్ సెజ్‌కు నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ కోసం రూ.298 కోట్ల ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన జరగనుంది.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఎంత వ్యయంతో అమలవుతుంది?
ఈ ప్రాజెక్టు రూ.7,360 కోట్ల వ్యయంతో అమలవుతుంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంత నీటిని తరలించనున్నారు?
మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-ktr-ktr-says-no-reaction-on-kavitha/telangana/543392/

Breaking News in Telugu CM Revanth Reddy Godavari Drinking Water Phase 2 3 Google News in Telugu Hyderabad Water Project Latest News in Telugu Musi River Revival ORR Water Supply

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.