తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సొంత పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లో టిక్కెట్ (Ticket in Congress)కేటాయింపు పై అంతర్గత విభేదాలు స్పష్టమవుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి టిక్కెట్ కోసం అంజన్ కుమార్ యాదవ్ చురుకైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో, ఆ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల “జూబ్లీహిల్స్ టిక్కెట్ స్థానికులకు మాత్రమే, బయట నుంచి ఎవరికి అవకాశమే లేదు” అని చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి.
Read Also: Dowry: కట్నం వద్దన్న వరుడు.. పెళ్లికి నో చెప్పిన వధువు..ఎందుకంటే?
ఈ వ్యాఖ్యలపై స్పందించిన అంజన్ కుమార్ యాదవ్, “పార్టీలో నేను పొన్నం ప్రభాకర్ కంటే చాలా సీనియర్ నాయకుడిని. టిక్కెట్ ఎవరికి ఇవ్వాలి అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఒక మంత్రి వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా చెబుతే అది పార్టీ శైలికి విరుద్ధం” అని విమర్శించారు.
అంజన్ కుమార్ యాదవ్, పార్టీ లోపలి వ్యవస్థలో సమానత్వం ఉండాలని డిమాండ్ చేశారు. “ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్న ఉదాహరణలు కాంగ్రెస్‌లోనే చాలానే ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి సోదరులు, మల్లు భట్టివిక్రమార్క-మల్లు రవి, వివేక్ కుటుంబం లాంటి వారు ఉన్నారు. నా కుమారుడు ఎంపీగా ఉన్నందుకు నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకూడదా?” అని ప్రశ్నించారు.
అదేవిధంగా, ఆయన బీఆర్ఎస్(BRS) కాలాన్ని ప్రస్తావిస్తూ, “కేసీఆర్ మహమూద్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి చేశారు. నాయిని నర్సింహారెడ్డికి కూడా ఎమ్మెల్సీ, హోంమంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు ఎవరు బయటివారన్న కారణం చెప్పలేదు” అని గుర్తు చేశారు.
ఈ వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అంతర్గత విభేదాలు బహిరంగంగా మారాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టిక్కెట్ ఎవరికి దక్కుతుందో అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టిక్కెట్ కోసం ఎవరు పోటీపడుతున్నారు?
మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల సారాంశం ఏమిటి?
జూబ్లీహిల్స్ టిక్కెట్ స్థానిక నాయకుడికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: