Crime-సెల్ ఫోన్ పోతే కొత్తది కొనచ్చు. కానీ మనం ఎంతో జాగ్రత్తగా పొదుపుతో దాచుకున్న సొమ్ము పోతే ఆ బాధను గురించి వర్ణించలేం. ఓ దుండగులు రద్దీస్థలాల్లో ఫోన్లను దొంగలిస్తుంటారు. ఫోన్ యజమాని వెంటనే ఆ నెంబర్ బ్లాక్ చేయడమో తన బ్యాంకు ఖాతాలను ఆపివేయడమో వంటి అప్రమత్త జాగ్రత్తలు(Vigilant precautions) తీసుకుంటాం. కానీ ఈలోగా ఫోన్ కొట్టేసిన వ్యక్తి ఖాతాలోని డబ్బును ఖాజేసే అవకాశం లేకపోదు. తాజాగా సికింద్రాబాద్ లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన సెల్ ఫోన్ నుంచి రెండు బ్యాంకు ఖాతాల ద్వారా ఓ దుండగుడు రూ.6లక్షలు అపహరించాడు.
బస్సులో ఫోన్ కొట్టేసిన ప్రబుద్ధుడు
నిజామాబాద్ (Nizamabad)కు చెందిన ప్రసాదావు బోయినపల్లిలో నాందేడ్ కు చెందిన బస్సు ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఫోన్ ను దొంగలించాడు. దీంతో ప్రసాద్ రావు బోధన్ లో కొత్త ఫోన్ కొనుగోలు చేసి తన పాత నంబర్పై సిమ్ తీసుకున్నారు. దాన్ని ఫోన్లో వేయగానే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కట్ అయినట్టు వెనువెంటనే సందేశాలు వచ్చాయి. దీంతో బాధితుడు వెంటనే బోయినపల్లి పోలీసులను ఆశ్రయించాడు. రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ. 6లక్షలకు పైగా విత్ డ్రా అయినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితుడు ఏం చేశాడు?
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు, కేసు నమోదు చేశారు.
ప్రజలకు పోలీసులు ఏమి సూచిస్తున్నారు?
బ్యాంకింగ్ యాప్‌లకు బలమైన సెక్యూరిటీ వాడాలని, ఫోన్ పోయిన వెంటనే బ్యాంక్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: