Crime News: ఇటీవల కూకట్పల్లిలో(Kukatpally) జరిగిన 12 సంవత్సరాల బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడు ఆంధ్రాలోని ఒంగోలుకు చెందిన వ్యక్తి. రెండేళ్ల క్రితమే నిందితుడి కుటుంబ హైదరాబాద్కు వచ్చింది. ఇదే బస్తీలో నిందితుడి కుటుంబం కిరాణా షాప్ నడుపుతోంది. అయితే ఇటీవల బాలిక పుట్టిన రోజు జరిగింది. ఈ వేడుకకు నిందితుడు వచ్చి కేక్ కూడా తినిపించాడు. నిందితుడిగా ఉన్న బాలుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటాడు. ఎక్కువగా ఒటిటిలో క్రైమ్ సిరీస్(Crime series) చూసే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడి తండ్రికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబంలో ఉన్న ఆ బాలుడు క్రికెట్ కిట్ కోనుక్కోవాలని డబ్బులను దొంగిలించినట్లు విచారణలో తేలింది.
చోరీకి ముందే మాస్టర్ ప్లాన్
దొంగతనానికి ముందే నిందితుడు తన ప్రణాళికను రాసుకున్నాడు. ప్లాన్ ప్రకారమే డబ్బులు దొంగతనం చేయగా.. ఆ బాలిక చూడటంతో తన గురించి బయట చెబుతుందని భావించిన బాలుడు ఆ బాలికను హతమార్చాడు. హత్యకు గురైన బాలిక తల్లిదండ్రులకు ఒక కుమారుడు ఓ కూతురు ఉన్నారు. తండ్రి బైక్ మెకానిక్ గా పనిచేస్తుండగా, భార్య ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోంది. కొన్నేళ్ల నుంచి వీరు కూకట్పల్లిలోనే ఉంటున్నారు. ఇటీవల ఇంట్లో తల్లిదండ్రులు లేనిసమయంలో బాలుడు ఇంట్లోకి దొంగతనం కోసం చొరబడ్డాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తండ్రి కూతురు రక్తపు మడుగులో పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పదోతరగతి బాలుడే హంతకుడు
కాగా బాలికను హత్య చేసింది పదోతరగతి బాలుడిగా పోలీసులు గుర్తించారు. బాలుడు దొంగతనం చేయడానికి వెళ్లగా ఆ బాలిక చూడడం వల్ల చంపేసినట్లు కూడా తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలుడు ఇంట్లోకి ప్రవేశించి, రూ.80వేలను దొంగలించాడు. బాలిక చూడడంతో అప్రమత్తమైన బాలుడు బాలికను కత్తితో పొడిచి చంపాడు. దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఏం చేయాలని ఊడా ఆ బాలుడు ముందే ప్లాన్(Plan) చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ నెట్ నుంచి ఆ వివరాలు సేకరించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి పిల్లలు సెల్ఫోన్లలో ఏం చూస్తున్నారు, వారేం చేస్తున్నారని పెద్దలు తల్లిదండ్రులు నిత్యం నిఘా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాదు పిల్లలను నిత్యం గమనిస్తుండాలని, వారి మానసిక స్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండాలని అంటున్నారు. లేకపోతే లేతవయసులోనే వారు చేయరాని పనులు చేస్తూ, జీవితాన్ని పాడుచేసుకుంటారని పోలీసులు సూచిస్తున్నారు.
హత్య ఎలా జరిగింది?
బాలుడు బాలిక ఇంట్లోకి చొరబడి రూ.80,000 దొంగలించాడు. ఆ సమయంలో బాలిక చూసి బయట చెబుతుందనే భయంతో ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు.
నిందితుడి ప్రవర్తనపై పోలీసులు ఏమన్నారు?
అతను సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండేవాడు. క్రైమ్ వెబ్ సిరీస్‌లు, ఇంటర్నెట్ ద్వారా క్రైమ్ ఐడియాలు సేకరించి తన ప్లాన్ రూపొందించాడు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :